Tue Dec 17 2024 08:49:55 GMT+0000 (Coordinated Universal Time)
Gold Price Today : బంగారం లాంటి కబురు.. గోల్డ్ రేట్స్ తగ్గుతున్నాయ్
ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొద్దిగా తగ్గుదల కనిపించింది
బంగారం అంటేనే అందరికీ ప్రియమైన వస్తువు. కానీ దానిని కొనుగోలు చేయాలంటేనే ఆర్థిక శక్తి సరిపోవడం లేదు. బంగారం, వెండి వస్తువుల ధరలకు నిరంతరం డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది. ఆ డిమాండ్ ఎప్పటికీ తగ్గేది కాదు. కొత్త జనరేషన్ లోనూ బంగారం అంటే ఎక్కువగా ఇష్టపడే వారే అధికంగా ఉండటంతో దీని డిమాండ్ ఏ మాత్రం పడిపోలేదు. దేశీయంగానే కాదు.. అంతర్జాతీయంగా కూడా ఇదే పరిస్థితి. విదేశాల్లో ఎక్కువ మంది గోల్డ్ బాండ్స్ ను కొనుగోలు చేస్తుంటారు. అధిక ధర వచ్చినప్పుడు తమకు అవసరమయినప్పుడు వాటిని విక్రయించి సొమ్ము చేసుకుంటారు. కానీ మనదేశంలో మాత్రం ఎక్కువ మంది గోల్డ్ బిస్కట్లు, ఆభరణాల కొనుగోలుకే మొగ్గు చూపుతుంటారు.
కొనుగోళ్లు పెరిగి...
అందుకే భారత్ లో ఎక్కడా లేని విధంగా జ్యుయలరీ దుకాణాలు వెలుస్తాయి. ఇతర దేశాల్లో గోల్డ్ ఏటీఎంలు సక్సెస్ అయినా మన దేశంలో పెద్దగా సక్సెస్ కాకపోవడానికి అనేక కారణాలున్నాయంటున్నారు. బంగారం, వెండి వస్తువులను స్టేటస్ సింబల్ గా చూస్తారు. తమ వద్ద బంగారాన్ని ఎంత దాచుకుంటే అంత గౌరవం లభిస్తుందని భావిస్తారు. అందుకే బంగారం కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయి. దక్షిణ భారత దేశంలో పెళ్లిళ్లు, శుభకార్యాలకు బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేయడం సంప్రదాయంగా వస్తుండటం కూడా ధరలు పెరుగుదలకు కారణమని చెబుతున్నారు. రానున్న కాలంలో బంగారం, వెండి ధరలు మరింత పెరుగుతాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
మూడు రోజుల నుంచి...
గత మూడు రోజుల నుంచి బంగారం, వెండి ధరలు కొంత దిగి వస్తున్నాయి. ఎంతో కొంత తగ్గుతున్నప్పటికీ పసిడి ప్రియులకు ఇది ఊరట కలిగించే అంశంగానే చెప్పాలి. బంగారాన్ని కొనుగోలు చేయాలంటే ఇదే మంచి సమయమని కూడా బిజినెస్ ఎక్స్ పెర్ట్స్ చెబుతున్నారు. ధరలు పెరగకుముందే కొనుగోలు చేయడం మంచిదని సూచిస్తున్నారు. ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొద్దిగా తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 71,390 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 77,880 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 99,900 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది. అయితే ఉదయం ఆరు గంటల వరకూ ఉన్న ధరలు మాత్రమే ఇవి. మధ్యాహ్నానికి ధరలు పెరగొచ్చు. తగ్గొచ్చు. స్థిరంగా ఉండవచ్చు.
Next Story