Thu Dec 26 2024 15:27:59 GMT+0000 (Coordinated Universal Time)
Gold Price Today : గుడ్ న్యూస్ తగ్గిన బంగారం ధరలు... వెండి ధరలు కూడా?
ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు భారీగా తగ్గాయి
బంగారం అంటే ఒక గౌరవం. సంపద. దానిని అందుకోవాలంటే పసిడిని సొంతం చేసుకోవడం ఒక్కటే మార్గం. పసిడి ఎంత మన వద్ద ఉంటే అంత గౌరవం సమాజం నుంచి మనకు పుష్కలంగా లభిస్తుందన్న అపోహ ఎక్కువ మందిలో ఉంది. ముఖ్యంగా మహిళల్లో ఈ రకమైన అభిప్రాయం ఎక్కువగా ఉండటంతో బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటాయి. డిమాండ్ కు తగినట్లుగా నిల్వలు లేకపోవడంతో ధరలు వాటికి ఇష్టమొచ్చినట్లు పెరుగుతుంటాయి. అయినా సరే.. కొనుగోలు చేయదలచుకున్న వారు ఎవరూ బంగారం విషయంలో తగ్గడం లేదు. బంగారం కొనుగోలు చేయాలని గట్టిగా భావించిన వారు ధరలను చూడరన్నది వ్యాపారులు ఎక్కువగా విశ్వసిస్తారు.
మహిళలే ఎక్కువగా...
అందుకే భారత్ లో బంగారం కొనుగోళ్లకు ఒక సమయం ఉండదు. ప్రధానంగా పండగలు, పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ లో అయితే ఇక చెప్పాల్సిన పనిలేదు. ధరలతో నిమిత్తం లేకుండా కొనుగోలు చేసే వారు అనేక మంది ఉంటారు. వీరిలో అత్యథిక శాతం మంది మహిళలే. ఎక్కువ మంది తమ ఇంట అవసరాల కోసం కొనుగోలు చేస్తుండగా, చాలా తక్కువ మంది పెట్టుబడిగా చూస్తూ బంగారం, వెండిని సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు. బంగారం కొనుగోలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో నష్టం రాదని భావించి చాలా మంది యువత కూడా ఇటీవల కాలంలో దానిపై పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడుతున్నారు. ప్రధానంగా సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు కూడా బంగారం కొనుగోలులో ముందున్నారని చెబుతున్నారు.
స్వల్పంగా తగ్గి...
బంగారం, వెండి ధరలను స్టేటస్ సింబల్ గా చూడటం వల్లనే దానికి ఎక్కడా లేని డిమాండ్ భారత్ లో కనిపిస్తుంది. అందుకే భారత్ లో ఆభరణాలను మాత్రమే ఎక్కువగా కొనుగోలు చేస్తారు. గోల్డ్ బిస్కట్లను కూడా కొందరు పెట్టుబడి కోసం చూసేవారు మాత్రమే కొనుగోలు చేస్తారు. ఇక ధరలు పెరగడంతో పాటు తరుగు పేరుతో మరికొంత ధరను వ్యాపారులు పెంచుతారు. ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 71,114 రూపాయలుకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 77,610 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 91,900 రూపాయలుగా నమోదయింది.
Next Story