Thu Apr 24 2025 04:56:13 GMT+0000 (Coordinated Universal Time)
Gold Price Today : ఎంతటి తీపి కబురు.. బంగారం ధరలు ఇంతగా దిగివస్తాయనుకోలేదే?
ఈరోజు దేశంలో బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి

బంగారం ధరలు గత కొద్ది రోజులుగా పతనం అవుతున్నాయి. నిజంగా ఇది మదుపరులకు మాత్రమే కాదు మధ్యతరగతి ప్రజలకు కూడా ఊరట కలిగించే అంశమే. ఎందుకంటే వరగా బంగారం ధరలు తగ్గుముఖం పడుతుండం ఎవరికి మాత్రం ఆనందం కలిగించదు. నిన్న మొన్నటి వరకూ ధరలు వినియోగదారులను భయపెట్టాయి. మామూలుగా కాదు. ప్రతిరోజూ పెరుగుదలతో అసలు బంగారం, వెండి కొనుగోలు చేయాలంటే జంకే పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి అంటే జనవరి నెల మొదటి వారంలో ప్రారంభమైన పసిడి పరుగు ఇక ఎక్కడా ఆగకుండా పరుగులు తీస్తూనే ఉంది. అలాగే దీంతో పాటు వెండి ధరలు కూడా ఆకాశాన్ని అంటాయి.
కొనుగోళ్లు పెరిగి....
పెళ్లిళ్ల సీజన్ జరుగుతుండటంతో ధరలు కొంత వరకూ దిగి వస్తుండటంతో నిన్నటి వరకూ నిలిచిపోయిన కొనుగోళ్లు మళ్లీ పెరిగాయంటున్నారు. నిన్న మొన్నటి వరకూ పది గ్రాముల బంగారం ధరలు 90 వేల రూపాయలు ఉండగా, ఇప్పుడు ధర దిగివచ్చింది. అలాగే వెండి ధరలు కిలో 1.14 లక్షల వరకూ పలికాయి. నేడు 93 వేల రూపాయలుకు అందుబాటులోకి వచ్చింది. అయితే అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం వంటి అంశాలు ధరలు బంగారం, వెండి ధరల్లో మార్పులు రావడానికి కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే కొనుగోళ్లు ఈ దెబ్బకు పెరుగుతాయని వ్యాపారులు చెబుతున్నారు.
ధరలు దిగి వచ్చి...
అయితే బంగారం, వెండి ధరలు రానున్న కాలంలో మరింత తగ్గుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏ స్థాయిలో పతనం అవుతాయన్నది చెప్పలేకపోయినా ధరలు దిగిరావడం ఖాయమని అంటున్నారు. ఈ ఏడాది పది గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలు దాటే అవకాశముందని అంచనాలు మాత్రం కార్యరూపం దాల్చవు. ఈరోజు దేశంలో బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై ఆరు వందల రూపాయల వరకూ తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఉదయం ఆరు గంటలకు నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 82,240 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 89,720 రూపాయల వద్ద ట్రెండ్ అవుతుంది. కిలో వెండి ధర 93,900 రూపాయలుగా ఉంది
Next Story