Tue Nov 26 2024 22:38:22 GMT+0000 (Coordinated Universal Time)
Gold Prices : భారీగా పెరిగిన బంగారం ధరలు.. బాగా తగ్గిన వెండి ఈరోజు రేట్లు?
ఈరోజు బంగారం ధరలు దేశ వ్యాప్తంగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం తగ్గాయి
పసిడి ధరలు ఒకరోజు తగ్గితే మరి కొన్ని రోజుల పాటు వరసగా పెరుగుతుంది. బంగారానికి ఉన్న స్పెషాలిటీ అదే. తగ్గితే తక్కువగా పెరిగితే మాత్రం ఎక్కువగా ధరలు ఉండటం ఒక్క బంగారం విషయంలోనే చూస్తాం. రాను రాను బంగారం ధరలు పెరగడమే తప్ప తగ్గడం అంటూ పెద్దగా ఉండదు. ఏదైనా తగ్గిన పదో పరకో తప్పించి పెరిగితే మాత్రం వందల రూపాయల్లో పెరుగుతూ వస్తుంది. త్వరలోనే అరవై ఐదు వేల రూపాయలకు చేరుకున్నా పెద్దగా ఆశ్చర్యం లేదు.
ధనత్రయోదశి కారణంగా...
ధన త్రయోదశి, దీపావళి వస్తున్న కారణంగా బంగారం ధరలకు మళ్లీ రెక్కలు రాక మానవు. ఆరోజు పసిడి కొనుగోలు చేయాలన్న సంప్రదాయం వస్తుండటంతో దానికి డిమాండ్ అధికంగా ఉంటుంది. డిమాండ్ కు తగిన బంగారం నిల్వలు లేకపోవడంతో ఆటోమేటిక్ గా మరలా ధరలు పెరుగుతాయి. మరోవైపు పెళ్లిళ్ల సీజన్ కూడా ప్రారంభం అయింది. దీంతో ఇక బంగారం ధరలు ఏ స్థాయికి వెళతాయో చెప్పడానికి కూడా అంచనా వేయలేం. అలా అని సంప్రదాయాలను అనుసరించి కొనుగోలు చేయలేకుండా ఉండలేం.
ధరలు ఇలా...
ఈరోజు బంగారం ధరలు దేశ వ్యాప్తంగా పెరిగాయి. పది గ్రాముల బంగారం పై వంద రూపాయలు పెరిగింది. వెండి ధర మాత్రం తగ్గింది. కిలో వెండి ధరపై ఏడు వందల రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 56,600 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 61,750 రూపాయలుగా నమోదయింది. ఇక కిలో వెండి ధర తగ్గి ప్రస్తుతం మార్కెట్ లో 77,000 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.
Next Story