Fri Dec 27 2024 19:51:14 GMT+0000 (Coordinated Universal Time)
Gold Price Today : వరసగా మహిళలకు షాకిస్తున్న బంగారం ధరలు.. ఇక ఆగడం కష్టమేనా?
ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి
బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. పరుగు ఆపడం లేదు. గత రెండు రోజుల నుంచి భారీగా పెరుగుతూ వినియోగదారులకు షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నాయి. బంగారం కొనుగోలు చేయాలనుకున్న వారికి ధరలు చూసి నిరాశ ఎదురవుతుంది. కొనుగోలు చేయాలంటే వెనకడుగు వేసేంతగా ధరలు పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతుంది. ధరలు పెరగడం బంగారం విషయంలో పెద్దగా ఆశ్చర్యం లేకపోయినా ఇలా ఏడాది చివర్లో కొనుగోలు చేద్దామని భావించే వారికి మాత్రం ధరలు ఆగేటట్లు చేస్తున్నాయి. వచ్చే ఏడాది ప్రారంభం నుంచి ధరలు మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
ధరలు పెరుగుతుండటంతో...
బంగారం ధరలు సీజన్ తో సంబంధం లేకుండా పెరుగుతుంటాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తుంది. శుభముహూర్తాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ సమయంలో బంగారం కొనుగోళ్లు మరింతగా పెరుగుతాయని వ్యాపారులు భావిస్తున్నారు. వచ్చే నెలలో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత మరికొంత ధరలు పెరిగే అవకాశముందని కూడా అంచనాలు వినపడుతున్నాయి. దీంతో పాటు అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాలలో నెలకొన్న మాంద్యం, యుద్ధాలు వంటి కారణాలతో బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులుంటాయని చెబుతున్నారు. అందుకే వెయిట్ చేయకుండా ఇప్పుడే కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు.
ధరలు పెరిగి...
బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు సహజమే అయినప్పటికీ మొన్నటి వరకూ పెరిగిన ధరలు కొంత శాంతించినట్లే కనిపించాయి. కొనుగోళ్లు తగ్గడంతో ధరలు మరింత తగ్గుతాయని భావించిన వారికి గత రెండు రోజుల నుంచి మాత్రం చేదువార్త వినపడుతుంది. వరసగా రెండు రోజుల నుంచి బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి. కిలో వెండి ధర మళ్లీ లక్షకు చేరుకుంది. ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 71,260 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 77,740 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 1,00,100 రూపాయలకు చేరుకుంది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ
Next Story