Thu Dec 26 2024 09:38:01 GMT+0000 (Coordinated Universal Time)
Gold Price Today : ఎనభై వేలకు చేరుకున్న పసిడి.. లక్ష పదివేలు దాటేసిన వెండి
ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది
ముహూర్తాలు ప్రారంభమయ్యాయి. మంచి రోజులు స్టార్టయ్యాయి. ఇంకేముంది.. బంగారం, వెండి ధరలు ఇక పరుగును అందుకున్నాయి. వేగంగా పరుగులు తీస్తున్నాయి. ప్రతి రోజూ ధరలు పెరుగుతూ బంగారం ధరలకు పసిడి ప్రియులకు షాక్ ఇస్తున్నాయి. ఇలా ధరలు పెరుగుతూ పోతే పది గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలకు చేరుకునే రోజు కూడా దగ్గరలోనే ఉందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఇప్పటికే 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనభై వేలకు చేరుకోవడంతో లక్షకు చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. దీంతో పసిడి, వెండిని భవిష్యత్ లో కొనుగోలు చేయడం గగనంగా మారుతుందని వ్యాపారులే చెబుతున్నారు.
ఇలా పెరిగితే...?
ఈ స్థాయిలో బంగారం ధరలు ఎప్పుడూ పెరగలేదు. కేంద్ర ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకం తగ్గించినప్పుడు కొద్దిగా తగ్గుతూ ఊరించిన బంగారం, వెండి ఆ తర్వాత మళ్లీ యధా స్థితికి వచ్చాయి. ప్రతి రోజూ బంగారం ధరలు పెరుగుతూ నిరాశకు గురి చేస్తున్నాయి. పెరుగుతుంది స్వల్పమా? భారీగానా? అన్నది పక్కన పెడితే అసలు తగ్గడం కానీ, స్థిరంగా ఉండటం కానీ గత కొన్ని రోజుల నుంచి జరగడం లేదు. ఇందుకు అనేక కారణాలు కనిపిస్తున్నా ఇప్పుడు పసిడి, వెండి కొనుగోలు చేయాలనుకునే వారు మాత్రం చాలా డబ్బులు వెచ్చించాల్సి వస్తుంది. అంత డబ్బులు వెచ్చించినా బంగారం ధరలు ఇంకా పెరుగుతాయేమోనన్న ఆందోళనతో తమ అవసరాల కోసం కొనుగోలు చేస్తున్నారు.
ధరలు పెరిగి...
ఇక పెట్టుబడి కోసం బంగారం కొనుగోలు చేసే వారు పసిడి, వెండి ధరలను చూసి కొంత వెనక్కు తగ్గినట్లే కనిపిస్తుంది. ఆభరణాలే ఎక్కువగా అమ్ముడవుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 73,010 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 79,650 రూపాయల వద్ద కొనసాగుతుంది. ఇక కిలో వెండి ధర 1,09,100 రూపాయలుగా ఉంది.
Next Story