Sat Dec 21 2024 15:40:44 GMT+0000 (Coordinated Universal Time)
Gold Price Today : నవరాత్రుల్లో పసిడిప్రియులకు షాకిస్తున్న గోల్డ్ రేట్స్
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో మాత్రం కొద్దిగా తగ్గుదల కనిపించింది
బంగారం ధరలు ఎంత మాత్రం తగ్గవు. తగ్గినా కొంచెమే. ఎప్పుడూ పెరగడమే బంగారానికి ఎరుక. పసిడికి పరుగు ఇష్టం. అందుకే అది ఎప్పటికీ ఆపదు. దానికి అలసట వచ్చినప్పుడు కొంత నిదానిస్తుందేమో కాని, తిరిగి పరుగు అందుకోవడం కొన్ని ఏళ్ల నుంచి జరుగుతుంది. అందుకే పుత్తడి ధరలు ఇరవై ఏళ్ల నాటితో నేటితో పోల్చి అస్సలు చూడలేం. అయితే నాడు ప్రజల కొనుగోలు శక్తి కూడా అలాగే ఉంది. రానురాను ప్రజల కొనుగోలు శక్తి పెరగడంతో పాటు బంగారానికి భారీగా డిమాండ్ పెరగడంతో ధరలు పెరిగినా ఎవరూ లెక్క చేయకుండా కొనుగోలు చేస్తున్నారు. అందుకే బంగారం ధరలు తగ్గే ప్రసక్తి ఉండదన్నది అందరికీ తెలిసిందే.
ప్రారంభమేనట....
ఇక సీజన్ ప్రారంభం కావడంతో బంగారం ధరలు మరింత ప్రియమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత కొద్ది రోజుల నుంచి పసిడి ధరల్లో పెరుగుదల ప్రారంభమయింది. ఇక ఇది ఆరంభం మాత్రమేనని ఇదే కొనసాగుతుందని మార్కెట్ నిపుణులు చెబుతన్నారు. అయితే ధరలు కాస్త అటుఇటు పెరిగినా, తగ్గినా పసిడి ప్రియులు మాత్రం కొనుగోళ్లు చేయడం ఆపడం లేదు. తమ అవసరాల నిమిత్తం, కుటుంబంలో శుభకార్యాల కోసం తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక పండగల సీజన్ కూడా కావడంతో ఇక బంగారం ధరలకు రెక్కలే వస్తాయి. దసరా తర్వాత దీపావళి పండగతో మరింతగా ధరలు పెరుగుతాయన్నది వ్యాపారుల అంచనా.
నేటి ధరలు...
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో మాత్రం కొద్దిగా తగ్గుదల కనిపించింది. ఉదయం ఆరు గంటల వరకూ నమోదయిన మార్కెట్ రేట్ల ప్రకారం పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 71,210 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 77,680 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర మాత్రం 94,900 రూపాయల వద్ద ట్రెండ్ అవుతుంది.
Next Story