Sat Nov 23 2024 00:49:13 GMT+0000 (Coordinated Universal Time)
Gold Price Today : ఆదివారం మహిళలకు షాకిచ్చిన బంగారం ధరలు
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు కూడా కొద్దిగా పెరిగాయి
బంగారం ధరలు పరుగు ప్రారంభించాయంటే ఇక ఆపడం కష్టం. అందులోనూ సీజన్ లో అది సాధ్యం కాదు. ఎందుకంటే డిమాండ్ అధికంగా ఉండే పసిడి ధరలు రోజురోజుకు పెరుగుతూనే ఉంటాయి. అయితే ధరలు ఎంత పెరిగినా కొనుగోలు దారులు మాత్రం కొనుగోళ్లకు అలవాటు పడి పోయారు. పసిడిని శ్రావణ మాసంలో కొనుగోలు చేస్తే మంచిదని ప్రతి ఒక్కరూ భావిస్తారు. అందులోనూ దక్షిణ భారత దేశంలో ఇలాంటి సెంటిమెంట్ ఎక్కువగా ఉండటంతో పుత్తడిని అప్పు చేసి మరీ కొనుగోలు చేయడం అలవాటుగా మార్చుకున్నారు. బంగారం తోడుంటే... ఆనందం మన ఇంట్లో ఉన్నట్లేనని భావించే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతుంది.
కొనుగోలు చేసేవారు...
నిజానికి గతంతో పోలిస్తే మహిళలు బంగారు ఆభరణాలను ధరించడం తక్కువగా చూస్తాం. కొన్ని చోట్ల మాత్రమే ఇది కనపడుతుంది. ఎక్కువ మంది బంగారాన్ని పెట్టుబడి కోసం కొనుగోలు చేస్తుంటారు. దీనివల్ల తమ వద్ద బంగారం ఉంటుందని, అది తమ కుటుంబానికి గౌరవంగా ఉంటుందని చెబుతారు. బంగారు ఆభరణాలను కొనుగోలు చేసి బ్యాంకు లాకర్లో పెడితే భద్రంగా ఉంటుందని భావించే అనేక మంది ఎక్కువ మొత్తంలో ధర తగ్గినప్పుడు కొనుగోలు చేస్తుంటారు. అందుకే దక్షిణ భారత దేశంలో బంగారం, పసిడికి ఒక సీజన్ అంటూ లేకుండా పోయింది. ఇక పెళ్లిళ్ల సీజన్ లో అయితే అమ్మకాలు పెరిగి మరింత ధరలు పెరుగుతాయి.
ధరలు నేడు...
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు కూడా కొద్దిగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది క్యారెట్ల బంగారం ధరలు66,950 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 73,400 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 93,000 రూపాయల వద్ద ట్రెండ్ అవుతుంది.
Next Story