Wed Apr 23 2025 02:01:11 GMT+0000 (Coordinated Universal Time)
Gold Prices Today : మరోసారి పసిడిప్రియులకు చేదువార్త.. బంగారం ధరలు భారీగా పెరిగి?
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం తగ్గాయి.

బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. నిన్నటి వరకూ తగ్గుతూ పసిడి ప్రియులకు ఊరట కలిగించిన పసిడి మళ్లీ పరుగును ప్రారంభించింది. వెండి ధరలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ఇటీవల బంగారం ధరలు తగ్గుతుండటంతో వినియోగదారులు సంతోషపడ్డారు. ఇక బంగారం ధరలు దిగి వస్తాయని ఆశించారు. బంగారం ధరలు అదుపులోకి వస్తే కొనుగోలు చేయవచ్చని ఆశపడ్డారు. బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో? ఎప్పుడు తగ్గుతాయో కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే బంగారం, వెండి ధరల్లో అనేక మార్పులు చేర్పులకు గల కారణాలు అనేకం ఉన్నాయి. అందుకే బంగారం ధరలు తగ్గుతాయని కొనుగోలు చేయకుండా ఉండటం అవివేకమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
తగ్గుతాయన్న ప్రచారంతో...
గత కొంతకాలంగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కొత్త సంవత్సరం ఆరంభం నుంచి బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దీనికి తోడు పెళ్లిళ్ల సీజన్ కూడా తోడవ్వడంతో ధరలను ఎవరూ అదుపు చేయలేకపోయారు. ఎంతగా అంటే గతంలో ఎన్నడూ లేనంతగా ధరలు పెిరగాయి. పది గ్రాముల బంగారం ధరలు యాభై ఐదు వేల రూపాయలకు చేరవచ్చన్న అంచనాలు వినిపిస్తున్న నేపథ్యంలో పెట్టుబడి పెట్టేవారు చాలా వరకూ తగ్గారు. అలాగే శుభకార్యాలు మినహాయించి వ్యక్తిగత అవసరాలకు కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. ఇటీవల కాలంలో మార్కెట్ నిపుణులతో పాటు బిజినెస్ నిపుణులు కూడా బంగారం ధరలు భారీగా పతనమవుతాయని చెప్పడంతో వేచిచూసే వారి సంఖ్య ఎక్కువగా ఉంది.
ధరలు ఇలా...
అయితే బంగారం, వెండి ధరలు తగ్గుతాయో? లేదో తెలియదు కానీ ఈ ప్రచారంతో అమ్మకాలపై తీవ్రమైన ప్రభావం చూపిందని వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. యాభై ఐదు వేల రూపాయలకు బంగారం ధర చేరుతుందన్న నమ్మకం తమకు లేదని వ్యాపారులు ఖచ్చితంగా చెబుతున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై ఏడు వందల రూపాయల వరకూ పెరిగింది. కిలో వెండి ధరపై వెయ్యి రూపాయల వరకూ తగ్గింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 82,910 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 90,450 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 92,900 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.
Next Story