Mon Dec 23 2024 18:34:21 GMT+0000 (Coordinated Universal Time)
Gold Prices Today : పెళ్లిళ్ల సీజన్ లో పసిడి ప్రియులుకు ఎంత రిలీఫ్ అంటే?
దేశంలో నేడు బంగారం ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా నిలకడగానే ఉన్నాయి.
బంగారం ధరలు పెరుగుతాయని భావించిన వారికి ఈరోజు ఎంతో శుభవార్త. బంగారం ధరలు పెరగలేదు. అలాగని తగ్గలేదు. తగ్గకపోయినా పరవాలేదు కానీ, పెరగకపోతే అంతే చాలు అన్న రీతిలో కొనుగోలుదారులు కోరుకుంటారు. అంతకు ముందు పది గ్రాముల బంగారం పై నాలుగు రోజుల పాటు పది రూపాయలు ధర తగ్గిన బంగారం, నిన్న మాత్రం కొంత పెరిగి భయపెట్టింది. అయితే నేడు మాత్రం ధరలు పెరగకపోవడంతో పెళ్లిళ్ల సీజన్ లో మాత్రం పసిడి కొనుగోలు చేసే వారికి రిలీఫ్ దొరికింది.
కారణాలు ఇవీ...
అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, రష్యా - ఉక్రెయిన్ల మధ్య యుద్ధం వంటి కారణాలతో బంగారం ధరలలో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. అయితే ధరలు పెరుగుతాయని మార్కెట్ నిపుణులు చెబుతూ వస్తున్నారు. ముందుగానే కొనుగోలు చేయాలని సలహా ఇస్తున్నారు. పెట్టుబడి పెట్టేవారు కూడా బంగారం ధరలు కొనుగోలు చేయడానికే ఎక్కువ మొగ్గు చూపారు. ఈ ఏడాది బంగారం పది గ్రాములు డెబ్భయి వేల రూపాయలకు చేరుకుంటుందన్న వార్తలు కూడా వచ్చాయి.
ధరలు ఇలా...
కానీ దేశంలో నేడు బంగారం ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా నిలకడగానే ఉన్నాయి. దీంతో పెళ్లిళ్ల సీజన్ సమయంలో పసిడి ప్రియులకు ఊరట లభించినట్లే. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 57,200 రూపాయలుగా నమోదయి ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 62,400 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర కూడా 78,000 రూపాయల వద్ద ట్రెండ్ అవుతుంది.
Next Story