Tue Nov 05 2024 19:41:51 GMT+0000 (Coordinated Universal Time)
Gold Price Today : షాకింగ్ న్యూస్... పెరిగిన బంగారం ధరలు.. వెండి ధరలు కూడా అంతే
ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. అదే సమయంలో వెండి ధరల్లో కూడా కొద్దిగా పెరుగుదల కనిపించింది.
బంగారం ధరలు ఎప్పుడూ అంతే ఊరించి.. రారమ్మని పిలవడానికే స్వల్పంగా తగ్గుతుంటాయి. అదే సమయంలో తగ్గుదల పెరుగుదల సూచకమేనని మార్కెట్ నిపుణుల సూచనలు నిజమయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. కొన్ని రోజులుగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పడుతుండటంతో కొనుగోలుదారులు కూడా ఆనంద పడ్డారు. కొనుగోళ్లు కూడా భారీగా పెరిగాయి. అదే సమయంలో పెట్టుబడి పెట్టేవారు సయితం ఇదే మంచి సమయమని భావించి కొనుగోలు చేస్తుండటంతో బంగారానికి మరింత డిమాండ్ పెరిగింది. వెండి ధరలు కూడా అదే స్థాయిలో తగ్గుతూ వస్తున్నాయి. జ్యుయలరీ దుకాణాలన్నీ వినియోగదారులతో కిటకిటలాడుతున్నాయి.
వచ్చే నెల నుంచి...
అయితే వచ్చేనెల నుంచి పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ధరలు మరింత పెరిగే అవకాశముందని వ్యాపారులతో పాటు మార్కెట్ నిపుణులు కూడా హెచ్చరికలను గత కొంత కాలంగా జారీ చేస్తున్నారు. అందుకే ముందుగానే పెళ్లిళ్ల అవసరాల కోసం అనేక మంది బంగారం, వెండిని కొనుగోలు చేస్తున్నారని వ్యాపారులు చెబుతున్నారు. ఇదే సమయంలో వివిధ రకాల డిజైన్లతో పాటు వినియోగదారులను ఆకట్టుకునే ఆఫర్లతో జ్యుయలరీ దుకాణాలు కూడా ముందుకు వచ్చి పెద్దయెత్తున చేస్తున్న ప్రకటనలను గుప్పిస్తున్నాయి. ప్రకటనలను చూసి మరీ బంగారం కొనుగోలుకు వినియోగదారులు రావడంతో జ్యుయలరీ దుకాణాల వద్ద రద్దీ పెరిగింది.
పెరిగిన ధరలు...
కార్పొరేట్ సంస్థలైన నగల దుకాణాలన్నీ ఆఫర్లను భారీగా ప్రకటిస్తున్నాయి. ఎందుకంటే సెప్టంబరు నెలలో ముహూర్తాలు లేకపోవడంతో వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఇది ఒక ఎత్తుగడ. ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. అదే సమయంలో వెండి ధరల్లో కూడా కొద్దిగా పెరుగుదల కనిపించింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర68,860 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 75,120 రూపాయల వద్ద ట్రెండ్ అవుతుంది. కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. కిలో వెండి ధర 97,600 రూపాయలుగా నమోదయింది.
Next Story