Thu Nov 21 2024 20:41:01 GMT+0000 (Coordinated Universal Time)
Gold Price Today : బ్యాడ్ న్యూస్.. మళ్లీ బంగారం ధరలు పెరిగాయిగా?
ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా కొద్దిగా పెరుగుదల కనిపించింది
బంగారం ధరలు పెరగవని ఆశించడం అత్యాశే అవుతుంది. పసిడి ధరలు ఎప్పుడూ తగ్గవు. ఒకవేళ తగ్గినా స్వల్పంగానే తగ్గుతాయి. పెరిగితే భారీగా పెరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన సత్యమే. బంగారం విషయంలో ప్రతి రోజూ ఇదే జరుగుతున్నా ఎక్కడో ఒక ఆశ.. ఇంకా తగ్గుతుందేమోనని కొనుగోలుకు వెయిల్ చేసేవాళ్లు చాలా మంది ఉన్నారు. అందులో పెట్టుబడిగా చూసే వారు అధికంగా ఉన్నారు. బంగారంపై ఎంత పెట్టినా అది సురక్షితమైన పెట్టుబడిగానే భావిస్తారు. ఎందుకంటే ఎంత ధర పెట్టి కొనుగోలు చేసినా వాటి ధరలు పెరిగి లాభాలను ఆర్జించి పెడుతుందే కాని.. నష్టం మాత్రం తెచ్చి పెట్టదు.
పెట్టుబడి పెట్టేవారు...
అందుకే బంగారం ధరల విషయంలో పెట్టుబడి పెట్టేవారు ఆలోచించరు. నిన్న మొన్నటి వరకూ బంగారం, వెండి ధరలు కొంత తగ్గినట్లు కనిపించినా మళ్లీ పెరగడం ప్రారంభించాయి. ఇక పెళ్లిళ్ల సీజన్ కూడా ఉండటంతో పాటు బంగారానికి డిమాండ్ అధికంగా ఉండటంతో పాటు, అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల ప్రభావం కూడా పెరుగుదలకు ఒక కారణంగా చెబుతున్నారు. తొలి నుంచి అనుకుంటున్నట్లుగానే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడయితే బంగారం ధరలు మరింత పెరుగుతాయని మార్కెట్ నిపుణులు వేస్తున్న అంచనాలు నిజమయ్యాయి. అయితే ధరలు భారీగా పెరగకపోవడం ఒకింత ఊరటనిచ్చే అంశమే.
ధరలు పెరిగి...
రానున్న కాలంలో బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశముందని వ్యాపారులు చెబుతున్నారు. అనేక కారణాలతో పసిడి, వెండి ధరలు పెరుగుతాయని తెలిపారు. ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా కొద్దిగా పెరుగుదల కనిపించింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగిది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 73,660 రూపాయాలకు చేరుకుంది 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 80,360 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,04,900 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.
Next Story