Sat Dec 21 2024 15:55:25 GMT+0000 (Coordinated Universal Time)
Gold Price Today : అక్టోబర్ మొదటి తేదీన బంగారం ప్రియులకు గుడ్ న్యూస్
ఈరోజు బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. వెండి ధరలు కూడా కొద్దిగా తగ్గాయి.
బంగారం ధరలు ఎప్పుడూ పెరుగుతుంటాయి. అలాంటిది తగ్గిందంటే చాలు పసిడి ప్రియులకు శుభవార్తేనని చెప్పాలి. ఎందుకంటే సీజన్ ప్రారంభమయిన నేపథ్యంలో బంగారం, వెండి ధరలకు రెక్కలు వస్తాయని అందరూ అనుకుంటున్నదే. మార్కెట్ నిపుణుల అంచనా కూడా బంగారం ధరలు పెరుగుతాయని చెబుతున్న నేేపథ్యంలో ధరలు తగ్గడం అంటే మామూలు విషయం కాదు. అంతో ఇంతో.. ఎంతో కొంత తగ్గిందంటే చాలు.. పెరగకుండా ఉంటే చాలు అన్న ధోరణికి బంగారం ప్రియులు వచ్చేశారంటే బంగారం, వెండి ధరలు ఏ రేంజ్ లో ఇటీవల కాలంలో పెరిగాయో అర్థం చేసుకోవచ్చు.
నిల్వలు ఎక్కువ...
రానున్నది పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధరలు మరింత పెరుగుతాయని వ్యాపారులు కూడా చెబుతున్నారు. రెండు నెలల పాటు బంగారం ధరల్లో పెరుగుదల ఉంటుందన్న అంచనాలు కూడా ఉన్నాయి. అయితే అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం వంటి కారణాలతో బంగారం, వెండి ధరల్లో హెచ్చు తగ్గులు కనిపించడం సహజమే అయినప్పటికీ డిమాండ్ పెరిగినప్పుడల్లా ఏ వస్తువుకైనా ధరలు పెరగడం సాధారణంగానే చూడాలి. బంగారం నిల్వలు భారత దేశంలో ఉన్నన్ని పుష్కలంగా మరే దేశంలో లేవన్నది వాస్తవం. అందుకు మనదేశంలో బంగారం ప్రియులు అత్యధికంగా ఉండటమే.
స్వల్పంగా తగ్గి...
ఈరోజు బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. వెండి ధరలు కూడా కొద్దిగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 70,790 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 77,230 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 94,900 రూపాయలకు చేరుకుంది. మొన్న లక్ష దాటిన కిలో వెండి ధర క్రమంగా తగ్గుతూ ఇప్పుడు చాలా వరకూ తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు.
Next Story