Mon Dec 23 2024 23:21:40 GMT+0000 (Coordinated Universal Time)
పరుగు ఆపడం లేదుగా
ఈరోజు దేశంలో బంగారం స్వల్పంగా పెరిగింది. వెండి ధర మాత్రం భారీగా తగ్గింది
కరెన్సీ నోట్ల తర్వాత అత్యంత ఇష్టపడే వస్తువు ఎవరైనా ఏదైనా ఉందంటే అది బంగారం మాత్రమే. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజం మాత్రం అంతే. బంగారాన్ని తమ సొంతం చేసుకునేందుకు ముఖ్యంగా మహిళలు అనేక రకాలుగా ప్రయత్నిస్తారు. కూడబెట్టిన కొద్ది కొద్ది సొమ్ముతో కొనుగోలు చేసే వారు కొందరైతే, పెట్టుబడిగా భావించి ఎక్కువ మొత్తంలో పసిడిని తమ సొంతం చేసుకునే వారు మరికొందరు. బంగారం వల్ల ఎప్పటికైనా లాభమే తప్ప నష్టం ఉండదన్న కారణంగానే బంగారానికి డిమాండ్ అధికంగా ఉంటుంది.
డిమాండ్ తగ్గక...
బంగారం ధరలు మాత్రం ఎవరికి అందకుండా పోతున్నాయి. ధర ఎంత పెరిగినా సరే గ్రాము బంగారాన్ని అయినా కొనుగోలు చేయాలని భావించడం కద్దు. ఇక శుభకార్యాల సమయంలో చెప్పాల్సిన పనిలేదు. బంగారం లేనిదే వేడుకలు జరగని పరిస్థితి మన భారతీయ సంస్కృతిలోనే ఉంది. అందుకే బంగారం సీజన్ తో సంబంధం లేకుండా నిత్యం కొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ధరలను బట్టి బంగారం ధరలు కూడా పెరుగుతాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
వెండి మాత్రం...
ఈరోజు దేశంలో బంగారం స్వల్పంగా పెరిగింది. పది గ్రాముల బంగారంపై పది రూపాయలు పెరిగింది. వెండి మాత్రం భారీగానే తగ్గింది. కిలో వెండి ధరపై మూడు వందల రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 55,200 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 60,230 రూపాయలుగా కొనసాగుతుంది. ఇక కిలో వెండి ధర మాత్రం 78,000 రూపాయలుగా నమోదయింది.
Next Story