Tue Nov 26 2024 18:38:15 GMT+0000 (Coordinated Universal Time)
Gold Rates : వావ్.. పసిడి ధర ఇంత తగ్గిందా.. ఎప్పుడూ లేదే?
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు కూడా తగ్గాయి
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. బంగారం ధరలు భారీగా తగ్గాయి. వరసగా రెండో రోజు కూడా తగ్గడంతో బంగారం కొనుగోలు చేసేవారికి, మదుపు చేసే వారికి శుభవార్తగా చెప్పాలి. పసిడి ధరలు ఈ సమయంలో తగ్గడం అంటే అందరికీ ఆనందమే. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారానికి ఎక్కువ డిమాండ్ ఉంది. జ్యుయలరీ దుకాణాలన్నీ కిటికిటలాడుతున్నాయి. శుభకార్యాలకు బంగారాన్ని వినియోగించడం భారతీయుల సంప్రదాయంగా వస్తుండటంతో దాని విలువ, డిమాండ్ ఎన్నటికీ తగ్గదు.
అందుకే తగ్గాయట..
అంతర్జాతీయ మార్కెట్లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, రష్యా - ఉక్రెయిన్ యుద్ధం కారణంగా బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తుంటాయని మార్కెట్ నిపుణులు చెబుతుంటారు. బంగారాన్ని తగ్గినప్పుడే కొనుగోలు చేయడం మంచిదని సూచిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం దిగుమతులు తగ్గించడం వల్ల కూడా బంగారం లభ్యత తగ్గి డిమాండ్ పెరగడంతోనే ధరలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. అలాంటిది గత రెండు రోజులుగా ధరలు తగ్గుముఖం పట్టడం ఆనందమే.
భారీగా తగ్గి...
ఈరోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై నాలుగు వందల రూపాయలు తగ్గింది. వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. వెండి కిలో ధరపై మూడు వందల రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 57,450 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 62,670 రూపాయల వద్ద కొనసాగుతుంది. కిలో వెండి ధర మాత్రం 81,000 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.
Next Story