Sat Dec 21 2024 06:51:02 GMT+0000 (Coordinated Universal Time)
Gold Price Today : మహిళలకు తీపి కబురు.. భారీగా తగ్గిన బంగారం ధరలు
బంగారం ధరలు మరింత ప్రియమవుతాయని ఆందోళన చెందేవారికి గుడ్ న్యూస్ అందిందనే చెప్పాలి
బంగారం ధరలు మరింత ప్రియమవుతాయని ఆందోళన చెందేవారికి గుడ్ న్యూస్ అందిందనే చెప్పాలి. ఎందుకంటే ఇంత పెద్దమొత్తంలో బంగారం ధరలు తగ్గడం ఇటీవల కాలంలో మొదటిసారి అని చెప్పాలి. కొనుగోళ్లు తగ్గడంతో బంగారం ధరలు కూడా తగ్గుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. వ్యాపారులు కొనుగోళ్లు తగ్గడంతో కొంత ఆందోళనలో ఉన్నారు. సీజన్ లో కూడా కొనుగోళ్లు మందగించడంతో ధరలు తగ్గితే కొంత కొనుగోలుదారులు ముందుకు వస్తారని భావిస్తున్నారు. వారు అనుకున్నట్లుగానే ధరలు కొంత శాంతించాయి. పరుగును ఆపి బంగారం ధరలు అందుబాటులోకి వచ్చాయనే చెప్పాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో వరసగా ప్రతి రోజూ బంగారం ధరలు తగ్గుతూనే ఉన్నాయి.
కొనేవారేరీ?
దీనికి ప్రధాన కారణం కొనేవారు లేకనేనని చెబుతున్నారు. డిమాండ్ పడిపోవడంతో ధరలు కూడా పతనమవుతున్నాయి. పెళ్లిళ్లు జరుగుతున్నా, మంచి ముహూర్తాలున్నప్పటికీ ధరలు తగ్గుతుండటంతో పసిడి ప్రియులు ఖుషీ అవుతున్నారు. పెట్టుబడి పెట్టేవారికి ఇదే మంచి సమయమని మార్కెట్ నిపుణులు కూడా చెబుతున్నారు. ఎందుకంటే ఇంతకు మించి ధరలు తగ్గేందుకు పెద్దగా అవకాశం లేదు. ఇంకా తగ్గుతాయని వెయిట్ చేస్తే మాత్రం మరింత పెరిగి అసలు కొనుగోలు చేయడం కష్టం కావచ్చన్న సూచనలు కూడా వెలువడున్నాయి. అందుకే తగ్గినప్పుడే బంగారం ధరలు కొనుగోలు చేయడం మంచిదని చెబుతున్నారు. ఈ సీజన్ దాటి వచ్చే ఏడాది ప్రారంభంలో బంగారం, వెండి ధరలు మరింత ప్రియమయ్యే అవకాశాలున్నాయంటున్నారు.
భారీగా తగ్గడంతో...
బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేయాలని ఎవరికి మాత్రం ఉండదు. కానీ ధరలు అందుబాటులో ఉంటే కొనుగోలు చేయడానికి ముందుకు వస్తారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు కూడా వెయ్యి రూపాయల వరకూ కిలోపై తగ్గింది. పది గ్రాముల బంగారం ధరపై 330 రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నేడు బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 70,390 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 76,790 రూపాయలు పలుకుతుంది. కిలో వెండి ధర 98,900 రూపాయలుగా ఉంది. అయితే ఉదయం ఆరు గంటలకు ఉన్న ధరలు మాత్రమే. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులు జరగవచ్చు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story