కార్లలో ఎయిర్ బ్యాగ్స్ విషయంలో కేంద్రం యూటర్న్
దేశంలో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అతివేగం, నిర్లక్ష్యంగా వాహనాలు నడపం, ట్రాఫిక్ నిబంధనలు..
దేశంలో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అతివేగం, నిర్లక్ష్యంగా వాహనాలు నడపం, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం, ఓవర్‌టెక్ తదితర కారణాలవల్ల ప్రతి రోజు జరిగే రోడ్డు ప్రమాదాల వల్ల ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఈ ప్రమాదాలలో ప్రాణాలను రక్షించుకునేందుకు కారులో ఉండే ఎయిర్‌బ్యాగ్స్ కీలకం. ప్రస్తుతం డ్రైవర్సీటుకు మాత్రమే ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. మిగత సీట్లకు ఉండవు. అయితే కారులో అన్ని సీటర్స్కు ఎయిర్ బ్యాగ్స్ ఉండాలని గతంలో కేంద్ర ప్రభుత్వం వాహనాల తయారీ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కారులో ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఉండాలనే నిబంధన తీసుకువచ్చింది. దీని వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు డ్రైవర్‌తో పాటు ఇతర ప్రయాణికుల ప్రాణలు పోకుండా కాపాడుకోవచ్చనే ఉద్దేశంతో ఈ నిబంధన తీసుకువచ్చింది. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని త్వరలో వాహనాల్లో 6 ఎయిర్‌బ్యాగ్‌లను తప్పనిసరి చేయనున్నారనే చర్చ చాలా కాలంగా జరుగుతోంది. అయితే ఇప్పుడు ఈ విషయంలో కేంద్రం కాస్త యూటర్న్ తీసుకుంది. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. వాహనాల్లో 6 ఎయిర్ బ్యాగ్స్ ఉండాలన్నది కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేయదని నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు.