ట్యాక్స్ లేకుండా దుబాయ్ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకురావచ్చు
మన భారతీయ సాంప్రదాయంలో బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ధరలు ఎంత పెరిగినా కొనుగోలుదారులతో బంగారం
మన భారతీయ సాంప్రదాయంలో బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ధరలు ఎంత పెరిగినా కొనుగోలుదారులతో బంగారం షాపులన్ని కిటకిటలాడుతుంటాయి. అయితే విదేశాల నుంచి బంగారాన్ని భారత్కు తీసుకురావాలంటే ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుందనే విషయం అందరికి తెలిసిందే. కానీ ట్యాక్స్ లేకుండా కొంత బంగారాన్ని దుబాయ్ నుంచి భారత్కు తీసుకువచ్చేందుకు వెసులుబాటు ఉంది. భారతదేశంలో బంగారం కొనడం శుభప్రదంగా పరిగణిస్తారు. నవంబర్ 10వ తేదీన ధంతేరస్ ఉంది. ఆ తర్వాత దీపావళి పండగ ఉంది. ఈ సమయంలో దేశంలోని బంగారం మార్కెట్లు బిజీబిజీగా ఉంటాయి. ప్రజలు కొనుగోలు చేయడానికి పోటెత్తారు. ఈ రోజుల్లో బంగారం విలువ పెరుగుతున్న కారణంగా వార్తల్లో నిలుస్తోంది. భారత్లో బంగారం ధర 10 గ్రాములకు 60 వేల రూపాయలను దాటింది. ఇది మరింత పెరగవచ్చని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఆరవ్ బులియన్ ప్రకారం.. భారత్లో 10 గ్రాముల బంగారం ధర రూ.61వేలకుపైగానే ఉంది.
దుబాయ్లో బంగారం ధర ఎంత?
దుబాయ్లో బంగారం చౌకగా ఉంటుందని మీరు కూడా అనుకుంటే, దాని ధరను తనిఖీ చేసి, భారతదేశంలో విక్రయించబడుతున్న బంగారం ధరతో పోలిస్తే.. ప్రస్తుతం దుబాయ్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,240గా ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,228గా ఉంది. భారతదేశంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60 వేల రూపాయల కంటే ఎక్కువ. అంటే భారత్లో కంటే దుబాయ్లో బంగారం చౌకగా ఉంటుంది.
దుబాయ్ నుంచి భారతదేశానికి ఎంత బంగారం తీసుకురావచ్చు?
భారతదేశం నుంచి దుబాయ్ సందర్శించే వ్యక్తులు బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వారు ఇండియా బంగారాన్ని తీసుకువస్తారు. అయితే మీరు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, దుబాయ్ నుండి భారతదేశానికి బంగారాన్ని తీసుకురావడానికి పరిమితి ఉంది. పరిమితికి మించి బంగారం తీసుకువస్తే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దుబాయ్ నుంచి భారత్కు బంగారాన్ని తీసుకురావడానికి డ్యూటీ ఫ్రీ లిమిట్ పురుషులకు 20 గ్రాములు, మహిళలకు 40 గ్రాములు మాత్రమే. ఇంతకంటే ఎక్కువ బంగారం తీసుకువస్తే భారీగా పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. భారీగా ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుందనే ఉద్దేశంతో గుట్టుచప్పుడు కాకుండా భారత్కు తీసుకువచ్చి విమానాశ్రయాల్లో కస్టమ్స్ అధికారులకు దొరికిపపోతారు.