Voter ID: ఓటర్ ఐడి కోసం దరఖాస్తు చేసుకోవడం ఎలా?
లోక్‌సభ ఎన్నికలు 2024 దగ్గర్లోనే ఉన్నాయి. ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో 50 లక్షల మందికి పైగా కొత్త ఓటర్లు తమ ఓటు హక్కును..
లోక్‌సభ ఎన్నికలు 2024 దగ్గర్లోనే ఉన్నాయి. ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో 50 లక్షల మందికి పైగా కొత్త ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.నేడు జాతీయ ఓటర్స్ డే సందర్భంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమం కల్పిస్తోంది ఎన్నికల కమిషన్. మీరు ఓటరు గుర్తింపు కార్డును సిద్ధం చేసుకోకుంటే వెంటనే సిద్ధం చేసుకోండి. 18 ఏళ్లు నిండిన యువకులు ఓటరు కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు ఈ సులభమైన మార్గంలో ఓటరుగా మారవచ్చు. ఓటు వేయాలంటే ఓటరు కార్డు తప్పనిసరి. అయితే ఓటర్ ఐడీ కార్డు లేని వారు సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఓటరు గుర్తింపు కార్డు కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- ముందుగా భారత ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి
- ఆ తర్వాత ఓటర్ సర్వీస్ పోర్టల్ (NVSP)పై క్లిక్ చేయండి.
- కొత్త ఓటరు నమోదు కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి క్లిక్ చేయండి
- ఇప్పుడు పుట్టిన తేదీ, చిరునామా, జనన ధృవీకరణ పత్రం వివరాలను సమర్పించండి
- ఆ తర్వాత సబ్మిట్పై క్లిక్ చేయండి
దరఖాస్తు చేసిన తర్వాత ఏమి చేయాలి
ఓటరు కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత మీ ఈ-మెయిల్ ఐడీకి ఇమెయిల్ వస్తుంది. ఈ ఇమెయిల్ ఓ లింక్ కలిగి ఉంటుంది. దాని ఆధారంగా అభ్యర్థి ఓటరు గుర్తింపు కార్డును రూపొందించడానికి తన స్థితిని తనిఖీ చేయవచ్చు. నెల రోజుల్లో ఓటర్ ఐడీ సిద్దమవుతుంది.
కావాల్సిన పత్రాలు:
- ఆధార్ కార్డ్
- జనన ధృవీకరణ పత్రం
- పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్
- పాన్ కార్డ్, క్లాస్ X, XII మార్క్ షీట్
- ఓటర్ కార్డ్-ఆధార్ కార్డ్ లింక్