మీ పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవడం ఎలా..? నాలుగు పద్దతుల్లో..
ప్రావిడెండ్ ఫండ్ (పీఎఫ్).. ఇది ఉద్యోగులకు ఎంతో భరోసా లాంటిది. ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత వారికి ఆసరాగా ఉంటుంది..
ప్రావిడెండ్ ఫండ్ (పీఎఫ్).. ఇది ఉద్యోగులకు ఎంతో భరోసా లాంటిది. ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత వారికి ఆసరాగా ఉంటుంది. అందుకే ఉద్యోగులు తమ భవిష్య నిధి (పీఎఫ్) డబ్బులను చివరి వరకు తమ అకౌంట్ నుంచి తీసేందుకు పెద్దగా ఇష్టపడరు. ఎందుకంటే ఉద్యోగ విరమణ తర్వాత వారికి పీఎఫ్ సొమ్ము ఎంతగానో ఉపయోగపడుతుంది. పైగా పీఎఫ్ ఖాతాలో డబ్బులకు వడ్డీ కూడా ఎక్కువగా వస్తుండటంతో ఆ సొమ్మను తీయకుండా అలాగే ఉంచుతారు. కానీ ప్రతి ఏడాది తమ ఖాతాలో వార్షిక వడ్డీ ఎంత జమ అవుతుంది..? దానిని ఎలా చెక్ చేసుకోవాలో అనే విషయం కొందరికి తెలిసినా.. చాలా మందికి తెలియని విషయం. తమ పీఎఫ్ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నాలుగు పద్దతులను అందుబాటులో ఉంచింది. అవేంటో చూద్దాం.
వెబ్సైట్లో లాగిన్ కావడం ద్వారా..
➦ లాగిన్ కాగానే మన ఖాతాలో ఉన్న ప్రావిడెంట్ ఫండ్ మొత్తం, వడ్డీ మొత్తానికి సంబంధంచి వివరాలు స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి.
➦ ఈ వివరాలను పీడీఎఫ్ (PDF) ఫార్మాట్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.