PAN Card: రెండు నిమిషాల్లోనే కొత్త పాన్ కార్డు.. ఎలాగంటే..
PAN Card: ప్రస్తుతం పాన్‌కార్డు అనేది ప్రతి ఒక్కరికి అవసరంగా మారింది. ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్ తెరిచి దగ్గరి నుంచి లావాదేవీలు నిర్వహించేందుకు పాన్‌కార్డు తప్పనిసరి
PAN Card: ప్రస్తుతం పాన్‌కార్డు అనేది ప్రతి ఒక్కరికి అవసరంగా మారింది. ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్ తెరిచి దగ్గరి నుంచి లావాదేవీలు నిర్వహించేందుకు పాన్‌కార్డు తప్పనిసరి. ఏదైనా బ్యాంకుల్లో ఒకేసారి 50 వేల రూపాయల వరకకు డిపాజట్ చేయాలన్నా పాన్‌కార్డు తప్పనిసరి కావాల్సిందే. పాన్ కార్డు నంబర్ ద్వారా ఆదాయపు పన్ను శాఖ వారి ఆర్థిక వియాలను గమనిస్తూ ఉంటుంది. అయితే ఒకప్పుడు పాన్‌కార్డు కావాలంటే కనీసం 45 రోజుల సమయం పట్టేది. ఆ తర్వాత రెండు వారాలు పట్టేది. ఇప్పుడు టెక్నాలజీ మారిపోయిన కారణంగా కేవలం రెండు నిమిషాల్లోనే తీసుకోవచ్చు.
అయితే పాన్ కార్డు కావాలంటే ఎక్కువ రోజులు సమయం పట్టకుండా కేవలం రెండు నిమిషాల్లోనే పొందేందుకు వెసులుబాటు వచ్చింది. మరి కేవలం రెండు నిమిషాల్లోనే పాన్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం.
➦ ఇందుకోసం ముందుగా.. ఇన్ కమ్ ట్యాక్స్ అధికారిక వెబ్సైట్ పోర్టల్ వెళ్లాలి.
➦ ఆ తర్వాత స్క్రీన్‌కి ఎడమ భాగంలో కనిపించే ఇన్ స్టాంట్ ఈ-పాన్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
➦ తర్వాత గెట్ న్యూ పాన్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిని సెలక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
➦ ఆ తర్వాత ఆధార్ నంబర్ నంబర్ర్ను నమోదు చేసిచెక్ బాక్స్ఫై క్లిక్ చేయాలి.
➦ అక్కడ క్లిక్ చేసిన వెంటనే మీ రిజిస్టర్ ఫోన్ నెంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేసి కంటిన్యూ చేయాలి.
➦ తర్వాత ఆధార్ వివరాలను చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత టర్మ్స్‌ను యాక్సెప్ట్ చేస్తూ చెక్ బాక్స్‌పై టిక్ చేయాల్సి ఉంటుంది.
➦ ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇన్‌స్టాంట్‌గా ఈ పాన్ కార్డ్ వస్తుంది. దీనిని మీరు PDFలో డౌన్లోడ్ చేసుకోవచ్చు.