ప్రపంచంలోని మొట్టమొదటి డిస్ప్లే-లెస్ స్మార్ట్‌ఫోన్.. దీని గురించి తెలిస్తే..
Humane AI Pin: ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోయింది. సరికొత్త సదుపాయాలను అందుబాటులోకి వస్తున్నాయి. టెక్నాలజీని ..
Humane AI Pin: ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోయింది. సరికొత్త సదుపాయాలను అందుబాటులోకి వస్తున్నాయి. టెక్నాలజీని ఉపయోగించుకుని కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లు మార్కెట్లో విడుదలవుతున్నాయి. ఇప్పుడున్న కాలంలో స్మార్ట్ ఫోన్‌లేనిది ఉండని పరిస్థితి ఉంది. చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్‌ను వినియోగిస్తున్నారు. అలాంటిది స్మార్ట్ఫోన్లకు చెక్ పెట్టేందుకు కొత్త ఏఐ డివైజ్ మార్కెట్లోకి వచ్చింది. అదే.. హ్యూమన్ ఏఐ పిన్ (Humane AI Pin) డివైజ్. ఆపిల్ కంపెనీ మాజీ ఉద్యోగులు ఈ హ్యూమన్ అనే కంపెనీని స్థాపించారు. తాజాగా ఈ కొత్త 'ఏఐ పిన్'ను రూపొందించారు.
మీరు మీ టీ-షర్టుపై AI పిన్ని ధరించవచ్చు లేదా మీ వర్క్ డెస్క్‌పై క్లిప్ చేయవచ్చు. పరికరానికి స్క్రీన్ ఉండదు. కానీ ఇది మీ తరపున పనులు చేయడానికి సందేశాలు పంపడానికి, కాల్లు చేయడానికి, చిత్రాలు తీయడానికి ChatGPT, Bingని ఉపయోగిస్తుంది. అయితే ప్రస్తుతం ఈ డివైజ్ ఎంతవరకు సక్సెస్ అయింది అనేది ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. కానీ, ఎక్కడ చూసినా ఈ ఏఐ పిన్ గురించే చర్చ కొనసాగుతోంది.
అసలు ఈ ఏఐ డివైజ్ ఏంటి?
ఆపిల్ మాజీ ఉద్యోగులైన ఇమ్రాన్ చౌదరి, బెథానీ బొంగియోర్నో కలిసి హ్యూమన్ అనే స్టార్టప్ కంపెనీని స్థాపించారు. ఈ ఏఐ డివైజ్ పనితీరుపై అనేక సందేశాలు వ్యక్తం అవుతుండగా, గత వారమే హ్యూమన్ ఏఐ పిన్ అనే మొదటిగా ప్రారంభించింది. అయితే దీనిని చూసేందుకు చాలా చిన్నగా ఉన్నా.. స్మార్ట్ ఫోన్ మాదిరిగానే పని చేస్తుందని చెబుతున్నారు. అన్ని స్మార్ట్ ఫోన్లకు డిస్ప్లే ఉన్నట్లు దీనికి ఉండదు.ఈ డివైజ్‌లో స్మార్ట్‌ఫోన్ మాదిరిగా డిస్ప్లే ఉండదు. ఈ ఏఐ పిన్ అయస్కాంతంగా ఉంటుంది. మీ చొక్కాకి సులభంగా క్లిప్ చేయవచ్చు. సరైన ఉపయోగం కోసం వాయిస్ ఎనేబుల్ చేస్తూ మీ షర్ట్‌పై ధరించడం ఉత్తమం.
దీని బరువు ఎంతో తెలుసా?
దీని బరువు 34 గ్రాములు. డివైజ్ ధర 699 డాలర్లు ఉంటుంది. నెలకు 24 డాలర్లు చెల్లించి సబ్స్క్రిప్షన్ పొందవచ్చు. ఈ పిన్ మోడల్ అమెరికాలోని టీ-మొబైల్లో ముందుగా లభిస్తోంది. దీనిలో 13 MP కెమెరా కూడా ఉంటుంది. ఏఐ పిన్ డివైజ్ ప్రీ-ఆర్డర్లు నవంబర్ 16 నుంచి ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది అంటే 2024 ప్రారంభంలో డెలివరీలు ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది.