Hurun Rich List: ముఖేష్ అంబానీని అధిగమించిన గౌతమ్ అదానీ
2024 హురున్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్
2024 హురున్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీని అధిగమించి అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ అత్యంత సంపన్న భారతీయుడిగా నిలిచారు. 2023 నివేదికలో, అదానీ సంపద 57 శాతం క్షీణించి రూ. 4.74 లక్షల కోట్లకు చేరుకోగా, అంబానీ రూ. 8.08 లక్షల కోట్ల సంపదతో ముందున్నారు. US-ఆధారిత షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన వివిధ ఆరోపణల తర్వాత అదానీ నెట్‌వర్త్ బాగా క్షీణించింది. హెచ్‌సిఎల్‌కి చెందిన శివ్ నాడార్ కుటుంబం రూ. 3.14 లక్షల కోట్లతో మూడవ స్థానంలో నిలిచారు. అయితే సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన సైరస్ పూనావల్ల 2024లో రూ. 2.89 లక్షల కోట్లతో నాలుగో స్థానానికి పడిపోయారు. సన్ ఫార్మాస్యూటికల్స్ దిలీప్ షాంఘ్వీ జాబితాలో రూ. 2.50 లక్షల కోట్లతో ఐదవ స్థానంలో నిలిచారు. జోహోకు చెందిన రాధా వెంబు రూ. 47,500 కోట్ల సంపదతో మహిళల్లో అత్యంత సంపన్నురాలు. నటుడు షారూఖ్ ఖాన్ రూ. 7,300 కోట్ల సంపదతో జాబితాలో స్థానం సంపాదించారు.