Mon Dec 23 2024 13:46:01 GMT+0000 (Coordinated Universal Time)
ఈనెలాఖరు వరకు ఈ పనులు పూర్తి చేసుకోండి.. లేకుంటే ఇబ్బందులే
సెప్టెంబర్ నెల ముగియడానికి ఇప్పుడు కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ నెలలో అనేక ఆర్థిక పనులకు గడువులు..
సెప్టెంబర్ నెల ముగియడానికి ఇప్పుడు కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ నెలలో అనేక ఆర్థిక పనులకు గడువులు ఉన్నాయి. ఈ నెల సగానికి పైగా గడిచిపోయింది. ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత కొత్త నెల అక్టోబర్ ప్రారంభం కానుంది. కానీ కొత్త నెలకు ముందు అనేక ఆర్థిక పనులకు సెప్టెంబర్ గడువు. సకాలంలో పూర్తి చేయడం చాలా ముఖ్యం. లేదంటే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
సెప్టెంబర్ నెల ముగియబోతోంది. మరి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే ఈ నెలలో కొన్ని పనులు పూర్తి చేయాల్సి వస్తుంటుంది. లేకుంటే పెనాల్టీలతో పాటు మరిన్ని ఇబ్బందులు వచ్చిపడే అవకాశాలుంటాయి. అందుకే క్రమం తప్పకుండా ఏయే నెలలో ఎలాంటి పనులు పూర్తి చేసుకోవాలన్న అంశాలను ముందస్తుగానే గమనించడం చాలా ముఖ్యం. అయితే ఈనెలాఖరు వరకు కొన్ని పనులు పూర్తి చేసుకోవాలని లేకుంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంటుంది. మరి ఎలాంటి పనులో ఒక సారి చూద్దాం.
☛ ఎస్బీఐ ప్రత్యేక ఎఫ్డీ: సీనియర్ సిటిజన్ల కోసం ఎస్బీఐ వీకేర్ స్పెషల్ ఎఫ్డీలో ఇన్వెస్ట్మెంట్ చేసేందుకు ఈనెల 30 వరకు గడువు ఉంది. ఈ ఎఫ్డీ ఖాతాలో అధిక వడ్డీ రేట్లను అందిస్తుంది. ఈ స్కీమ్‌కు సీనియర్ సిటిజన్లు మాత్రమే అర్హులు. ఎస్బీఐ వీకేర్ 7.50 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.
☛ ఐడీబీఐ అమృత్ మహోత్సవ్ ఎఫ్డీ: ఇక ఐడీబీఐ బ్యాంక్ ఈ స్కీమ్‌ను ప్రారంభించింది. అమృత్ మహోత్సవ్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ఇది. ఈ పథకం కింద, బ్యాంక్ 375 రోజుల ఎఫ్డీపై 7.10 శాతం వడ్డీని అందిస్తోంది. సీనియర్ సిటిజన్లకు 7.60 శాతం వడ్డీ లభిస్తుంది. ఇది కాకుండా, బ్యాంక్ 444 రోజుల ఎఫ్డీపై సాధారణ పౌరులకు 7.51 శాతం , సీనియర్ సిటిజన్లకు 7.65 శాతం వడ్డీని అందిస్తోంది.
☛ డీమ్యాట్ మ్యూచువల్ ఫండ్ నామినేషన్ గడువు: డీమ్యాట్, మ్యూచువల్ ఫండ్లలో నామినీల వివరాలను అందించడం SEBI తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డిమ్యాట్, మ్యూచువల్ ఫండ్లలో నామినీని ప్రకటించడానికి లేదా నామినేషన్ ఉపసంహరణకు 30 సెప్టెంబర్ 2023 చివరి తేదీ.
☛ 2,000 నోటు మార్చుకోవడానికి చివరి తేదీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకున్న తర్వాత, నోట్లను మార్చుకునేందుకు ఆర్బీఐ నాలుగు నెలల సమయం ఇచ్చింది. దీనికి చివరి తేదీ సెప్టెంబర్ 30. అంటే ఈనెలాఖరులోగా ఈ పెద్ద నోట్లు ఉన్న వారు బ్యాంకులకు వెళ్లి మార్చుకోవాలి. గడువు దాటిపోతే ఈ నోట్లు చెల్లుబాటు కావు.
Next Story