రైల్వే స్టేషన్లో ‘ట్రైన్ హరన్’ మోగడంలో అర్థాలు ఏమిటో తెలుసా?
మన చుట్టు జరిగేవి వాటిలో అర్థాలు చాలానే ఉంటాయి. కానీ మనం వాటిని గమనించం. అలాంటిదే ఇప్పుడు మీకు చెప్పబోయేది..
మన చుట్టు జరిగేవి వాటిలో అర్థాలు చాలానే ఉంటాయి. కానీ మనం వాటిని గమనించం. అలాంటిదే ఇప్పుడు మీకు చెప్పబోయేది. మనకు తరచుగా రైల్వే స్టేషన్లో వినిపించేది రైలు హరన్. స్టేషన్‌కు చేరేముందు కానీ, క్రాసింగ్‌ల వద్ద కానీ రైలు డ్రైవర్ హరన్ మోగిస్తుంటాడు. అన్ని రైళ్ల హరన్లు ఒకేలా వినిపించినా.. వాటిలోచాలానే అర్థాలు ఉంటాయి. మరీ రైలు ఇచ్చే హరన్‌లో అర్థాలేంటో చూద్దాం.
➦ ట్రైన్ కిచెన్ లో ఉన్న మోటార్ మ్యాన్ గార్డుకు సిగ్నల్ ఇవ్వడానికి ఒక షాట్ హరన్ ఇస్తాడు. దీంతో గార్డు అంత చెక్ చేసి ట్రైన్ కదలడానికి సిగ్నల్ ఇస్తాడు.
➦ ఇక మూడు సార్లు షాట్ హరన్ ఇచ్చాడంటే అది మోటారు మ్యాన్ అదుపు తప్పిందని అర్థం. దీంతో వార్డు వ్యాక్యుమ్ బ్రేక్ ను లాగుతాడు. దాంతో ట్రైన్ ఆగిపోతుంది.
➦ ఇక నాలుగు సార్లు షాట్ హరన్ ఇచ్చాడంటే ట్రైన్ లో ఏదో సాంకేతిక లోపం ఉందని, ట్రైన్ స్టేషన్ నుంచి వెళ్లదని తెలుపడానికి ఈ సిగ్నల్ ఇస్తారు.
➦ రెండు లాంగ్ హరన్లు, రెండు షాట్ హరన్ లు ఇచ్చాడంటే ఆ ట్రైన్‌ను మోటార్ మ్యాన్ కంట్రోల్ నుంచి గార్డు కంట్రోల్ లోకి తీసుకుంటున్నట్లు అర్థం.
➦ ఒక వేళ వరుసగా హరన్ మోగుతుంటే ఆస్టేషన్‌లో రైలు ఆగదని అర్థం.
➦ రైలు రెండు సార్లు ఆగి, రెండుసార్లు హరన్ మోగిస్తే అది రైల్వే క్రాసింగ్ దాటుతుందని అర్థం.
➦ రెండు షాట్ హరన్, ఒక లాంగ్ హరన్ మోగిస్తే ఎవరో చైన్ లాగాడని అర్థం.
➦ రైలుకు ఏదైన ప్రమాదం వస్తే ఆరు సార్లు షాట్ హరన్స్ మోగిస్తారు.
➦ రైలు డ్రైవరు చిన్నగా హారన్ కొడితే రైలు యార్డ్‌లోకి వచ్చిందని, దానిని శుభ్రం చేయడానికి సమయం ఆసన్నమైందని అర్థం.