LIC Jeevan Dhara II: ఎల్ఐసీ నుంచి సరికొత్త పాలసీ
LIC Jeevan Dhara II: ప్రస్తుతం చాలా మంది వివిధ రకాల ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకుంటున్నారు. పాలసీలలో రకరకాలు ఉంటున్నాయి.
LIC Jeevan Dhara II: ప్రస్తుతం చాలా మంది వివిధ రకాల ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకుంటున్నారు. పాలసీలలో రకరకాలు ఉంటున్నాయి. హెల్త్ పాలసీ, టర్మ్ పాలసీ, సేవింగ్,వ్యక్తిగత పాలసీలు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ కార్పొరేషన్ సరికొత్త పాలసీని పరిచయం చేస్తోంది. అదే జీవన్ ధార 2 ప్లాన్ పాలసీ.
ఇది వ్యక్తిగత, సేవింగ్స్, డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్. ఈ పాలసీ తీసుకోవాలంటే కనీస వయసు 20 ఏళ్లు. గరిష్ఠ వయసు 80, 70, 65 సంవత్సరాలు ఉండాలి. ప్రారంభం నుంచి యాన్యుటీకి అనుమతిస్తారు. అయితే ఈ ప్లాన్ జనవరి 22వ తేదీ నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ఈ ప్లాన్ కింద 11 యాన్యుటీ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. ఈ మేరకు ఎల్ఐసీ చైర్మన్ సిద్ధార్థ మొహంతి దీన్ని ఆవిష్కరించారు. డిఫర్మెంట్ సమయంలో జీవిత బీమా కవరేజీ కూడా కల్పిస్తారు.
అధిక వయసుకి అధిక యాన్యుటీ రేట్లు వర్తించేలా ఈ పాలసీ ప్లాన్ను రూపొందించారు. రెగ్యులర్ ప్రీమియం, సింగిల్ ప్రీమియం అందుబాటులో ఉంటాయి. డిఫర్మెంట్ అంటే పాలసీదారుడు ఎంచుకున్న మేరకు భవిష్యత్తులో బీమా పాలసీ ప్రయోజనాలు అందుకునే విధంగా ఈ ప్లాన్ను తయారు చేశారు. కాలపరిమితి రెగ్యులర్ ప్రీమియంలో 5-15 సంవత్సరాలు. కాగా సింగిల్ ప్రీమియంలో 1-15 సంవత్సరాలు ఉంటుంది. డిఫర్మెంట్ సమయంలోను, ఆ తర్వాత కూడా రుణ సదుపాయం అందుబాటులో ఉంటుందని మొహంతి తెలిపారు.