Gas Cylinder: వినియోగదారులకు షాక్.. గ్యాస్ సిలిండర్ ధర పెంపు
దేశంలోని వినియోగదారులకు షాకిచ్చాయి చమురు మార్కెటింగ్ కంపెనీలు. గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూ కీలక నిర్ణయం ..
దేశంలోని వినియోగదారులకు షాకిచ్చాయి చమురు మార్కెటింగ్ కంపెనీలు. గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నాయి. 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధరను రూ. 21 పెంచుతున్నట్లు ఆయిల్ గ్యాస్ కంపెనీలు ప్రకటించాయి. ఈ కొత్త గ్యాస్ సిలిండర్ రేట్లు ఈ రోజు నుంచి అనగా డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు పేర్కొన్నాయి.
ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర రూ. 1796.5 గా ఉంది. అలాగే కోల్ కత్తాలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ. 1908 గాను, అదే విధంగా ముంబై లో రూ. 1749 గాను, అదే బెంగళూరులో రూ. 1883 గాను, ఇక చెన్నైలో రూ. 1968.50 గా ఉంది. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, హైదరాబాద్ లో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ. 2002 గాను, అలాగే విజయవాడలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ. 1956.50 గా ఉంది.
ఇక గృహోపకరణాల కోసం వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరలలో ఎలాంటి మార్పు లేదు. సాధారణంగా చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య, గృహ వినియోగ సిలిండర్ ధరలను ప్రతి నెలా ఒకటవ తేదీన సమీక్షించి సవరిస్తూ ఉంటాయి. ఇలా సవరించిన సిలిండర్ ధరలు ఒకటో తేదీ నుంచే అమల్లోకి వస్తాయి. అయితే నవంబర్ నెలలో చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను రూ. 57 మేర తగ్గించాయి.