Mon Dec 23 2024 18:47:39 GMT+0000 (Coordinated Universal Time)
మార్చి నెలలో బ్యాంకులకు సెలవులు ఇవే!
మార్చి నెలలో బ్యాంక్‌లు 14 రోజుల పాటు మూసి ఉంచనున్నారు
మార్చి నెలలో బ్యాంక్‌లు 14 రోజుల పాటు మూసి ఉంచనున్నారు. ఆ 14 రోజుల్లో నేషనల్ పబ్లిక్ హాలిడేస్, కొన్ని ప్రాంతీయ సెలవులు ఉన్నాయి. ఇక రెండు, నాలుగు శనివారాలు, ఆదివారాలు సెలవు దినాలు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాంక్ సెలవులను నిర్ణయిస్తాయి. ఒక ప్రాంతంలో హాలిడే ఉంటే మరో ప్రాంతంలో ఉండకపోవచ్చు.
2024 మార్చిలో బ్యాంక్ సెలవు రోజులు :
మార్చి 01 (శుక్రవారం): చాప్చార్ కుట్ (మిజోరంలో సెలవు)
మార్చి 08 (శుక్రవారం): మహా శివరాత్రి (దేశవ్యాప్తంగా బ్యాంక్‌లకు సెలవు)
మార్చి 22 (శుక్రవారం): బిహార్ దివస్ (బీహార్‌లో బ్యాంక్‌లకు సెలవు)
మార్చి 25 (సోమవారం): హోలీ.. కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, మణిపూర్, కేరళ, నాగాలాండ్, బీహార్, శ్రీనగర్ మినహా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో సెలవు
మార్చి 26 (మంగళవారం): యయోసాంగ్ రెండో రోజు/హోలీ.. ఒడిశా, మణిపూర్, బీహార్‌లో బ్యాంక్‌లు పని చేయవు
మార్చి 27 (బుధవారం): హోలీ.. బీహార్‌లో బ్యాంక్‌లకు సెలవు
మార్చి 29 (శుక్రవారం): గుడ్ ఫ్రైడే.. త్రిపుర, అసోం, రాజస్థాన్, జమ్ము కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ మినహా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో సెలవు
సాధారణ సెలవులు:
మార్చి 03: ఆదివారం
మార్చి 09: రెండో శనివారం
మార్చి 10: ఆదివారం
మార్చి 17: ఆదివారం
మార్చి 24: ఆదివారం
మార్చి 30: నాలుగో శనివారం
మార్చి 31: ఆదివారం
Next Story