ఉచితంగా గ్యాస్ సిలిండర్ కనెక్షన్.. దరఖాస్తు చేయడం ఎలా?
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మహిళల కోసం పలు పథకాలను అమలు చేస్తూనే ఉంది. మోడీ ప్రవేశపెడుతున్న పథకాల్లో..
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మహిళల కోసం పలు పథకాలను అమలు చేస్తూనే ఉంది. మోడీ ప్రవేశపెడుతున్న పథకాల్లో 'ప్రధాన మంత్రి ఉజ్వల యోజన' ఒకటి. ఇటీవల, ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ తన వీకెండ్ మీటింగ్‌లో ఉజ్వల 2.0 పథకాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం మహిళలకు 75 లక్షల ఉచిత ఎల్పీజీ కనెక్షన్లను అందించబోతున్నట్లు ప్రకటించింది. వచ్చే మూడేళ్లలో మహిళలకు ఈ గ్యాస్ కనెక్షన్లు ఇవ్వనున్నట్లు కేంద్రం తెలిపింది. కేబినెట్ ఈ నిర్ణయం తర్వాత దేశంలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారుల సంఖ్య 10.35 కోట్లకు పెరగనుంది.
ఉజ్వల పథకానికి ఎవరు అర్హులు?
దరఖాస్తు చేసుకోవడం ఎలా?
➦ ఇక్కడకు వెళ్లి డౌన్లోడ్ ఫారమ్ ఎంపికను ఎంచుకోండి.
➦ దీని తర్వాత, ఒక ఫారమ్ కనిపిస్తుంది. దానిని డౌన్లోడ్ చేసి.. అందులో అడిగిన అన్ని వివరాలను పూరించండి.
➦ మీ దగ్గరలోని గ్యాస్ ఏజెన్సీలో డిపాజిట్ చేయండి.
➦ రేషన్ కార్డు, ఫోటో, మొబైల్ నంబర్ వంటి అవసరమైన పత్రాలను కూడా నమోదు చేయండి.
➦ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మీరు కొత్త కనెక్షన్‌ని అందిస్తారు.