IMPS యూజర్లకు గుడ్‌న్యూస్.. సులభంగా రూ.5 లక్షల వరకు బదిలీ
భారతదేశంలో డిజిటల్ చెల్లింపు వేగంగా పెరిగింది. బ్యాంకులకు వెళ్లకుండానే ఇంట్లోనే ఉండి మీ మొబైల్ ద్వారా చెల్లింపులు..
భారతదేశంలో డిజిటల్ చెల్లింపు వేగంగా పెరిగింది. బ్యాంకులకు వెళ్లకుండానే ఇంట్లోనే ఉండి మీ మొబైల్ ద్వారా చెల్లింపులు చేయవచ్చు. టెక్నాలజీ పెరిగినకొద్ది కొత్త కొత్త సర్వీసులు అందుబాటులోకి వస్తున్నాయి. డిజిటల్ చెల్లింపులో నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ (NEFT), రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (RTGS), తక్షణ చెల్లింపు సేవ (IMPS -Immediate Payment Service) వంటి అనేక పద్ధతుల ద్వారా ఆన్లైన్ చెల్లింపు జరుగుతుంది. ఈ పద్ధతులతో చిన్న మొత్తాలను పెద్ద మొత్తంలో బదిలీ చేయడం సులభం అయింది.
నెట్ బ్యాంకింగ్ నగదు బదిలీలో IMPS ద్వారా చెల్లింపు ప్రధాన ఎంపికలలో ఒకటి. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్త నిబంధనలు తీసుకువస్తోంది. తద్వారా ఐఎంపీఎస్ లావాదేవీలు, ప్రభావవంతంగా మారతాయి. ఈ పద్ధతి ద్వారా త్వరలో వినియోగదారులు రూ. 5 లక్షల వరకు బదిలీ చేసుకునే సదుపాయం రానుంది.
రూ. 5 లక్షల వరకు బదిలీ చేయడానికి మీరు ఏ బ్యాంక్ ఖాతాను జోడించాల్సిన అవసరం లేదు. అలాగే ఐఎఫ్ఎస్సీ (IFSC) అందించాల్సిన అవసరం లేదు. మీరు మొబైల్ నంబర్, బ్యాంక్ పేరు సహాయంతో ఐఎంపీఎస్ ద్వారా రూ. 5 లక్షల వరకు మొత్తాన్ని మాత్రమే బదిలీ చేయగలరు.
ఐఎంపీఎస్ సేవ ద్వారా ఎప్పుడైనా చెల్లింపు చేయవచ్చు. ప్రపంచంలోనే ఈ విధానాన్ని అమలు చేసిన నాలుగో దేశం భారత్. ఇది నిజ సమయ చెల్లింపు పద్ధతి. ఒక ఖాతా నుండి మరొక ఖాతాకు త్వరగా డబ్బును బదిలీ చేస్తుంది. దీన్ని ఉపయోగించి మీరు డబ్బును ఎలా బదిలీ చేయవచ్చో తెలుసుకుందాం. అయితే ప్రస్తుతం ఈ సర్వీసు ప్రారంభం కాలేదు. త్వరలో ఈ సేను ప్రారంభించనున్నట్లు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది.
ఐఎంపీఎస్ సహాయంతో ఇలా డబ్బును బదిలీ చేయండి:
➦ మొదట మొబైల్ బ్యాంకింగ్ వ్యవస్థను తెరవండి
➦ ఇప్పుడు దాన్ని తెరవడానికి ఫండ్ బదిలీ విభాగంపై క్లిక్ చేయండి.
➦ నిధులను బదిలీ చేయడానికి 'IMPS' పద్ధతిని ఎంచుకోండి
➦ మీరు డబ్బు పంపాల్సిన మొబైల్ నంబర్, బ్యాంక్ పేరును నమోదు చేయాలి.
➦ బ్యాంక్ ఖాతా లేదా IFSC నంబర్‌ను నమోదు చేయవలసిన అవసరం లేదు
➦ ఇప్పుడు మీరు మీ ఖాతాకు పంపాలనుకుంటున్న మొత్తాన్ని నమోదు చేయండి.
➦ మీరు రూ. 5 లక్షల వరకు మొత్తాన్ని పంపగలరు
➦ అవసరమైన మొత్తం సమాచారాన్ని అందించిన తర్వాత, కన్ఫర్మ్‌పై క్లిక్ చేయండి.
➦ OTPని నమోదు చేసిన వెంటనే డబ్బు బదిలీ చేయబడుతుంది.