Fri Nov 22 2024 21:39:00 GMT+0000 (Coordinated Universal Time)
Onion : గుడ్ న్యూస్.. ఉల్లి ధరలు తగ్గుతున్నాయటగా?
ఉల్లి ధరలు అమాంతంగా పెరిగాయి. కిలో ఉల్లి ధరలు అరవై రూపాయల వరకూ చేరుకుంది. దీంతో ఉల్లి కొనాలంటే ప్రజలు భయపడిపోతున్నారు
ఉల్లి ధరలు అమాంతంగా పెరిగాయి. కిలో ఉల్లి ధరలు అరవై రూపాయల వరకూ చేరుకుంది. దీంతో ఉల్లి కొనాలంటే ప్రజలు భయపడిపోతున్నారు. నిన్నటి వరకూ టమాటా ధరలు పెరగగా, నేడు ఉల్లి ధరలు పెరిగి కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. భారీ వర్షాలకు దిగుబడి తగ్గడంతోనే ఉల్లి ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చే ఉల్లి కూడా సరైన రీతిలో హైదరాబాద్ కు చేరుకోకపోవడంతో ధరలు ఇంకా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. హోల్సేల్ మార్కెట్ లోనే అరవై కిలో ఉల్లి ధర పలుకుతుండగా, బయట మార్కెట్ లో డెబ్భయి రూపాయల వరకూ విక్రయిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం..
ఉల్లి ధరలు అమాంతం పెరగడంతో ప్రభుత్వాలు రంగంలోకి దిగాయి. కేంద్ర ప్రభుత్వం ఉల్లి ధరలను రాయితీపై విక్రయించేందుకు సిద్ధమయింది. అయితే అది ఢిల్లీ తో పాటు చుట్టు పక్కల ప్రాంతాలకే ఉల్లిని రాయితీ ధరపై విక్రయించనుంది. అక్కడ ఉల్లిని 35 రూపాయలకు కిలో చొప్పున విక్రయించేందుకు సిద్ధమయింద.ి. ఢిల్లీ వాసులకు ఇది గుడ్ న్యూస్ వంటిది. మరోవైపు దేశ వ్యాప్తంగా ఉల్లి ధరలు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.
దిగుబడి తగ్గడంతో...
ఉల్లి పాయ ధరలు భారీగా పెరగడంతో వినియోగదారులు కొనుగోళ్లు కూడా తగ్గించారు. ఉల్లి పాయలు లేకుంటే వంట గదిలో ఏ పని జరగదు. ఉల్లిని అంతగా వినియోగిస్తారు. హోల్సేల్ మార్కెట్ నుంచి హోటళ్ల యజమానులు ఉల్లిపాయలను భారీగా తీసుకెళుతుండటంతో సామాన్యుల వద్దకు వచ్చేసరికి మరింత పెరుగుతున్నాయి. దిగుబడి తక్కువ, డిమాండ్ ఎక్కువ కావడంతో ఉల్లి ధరలు మరింత పెరుగుతాయని ఒకవైపు చెబుతున్నా కేంద్ర ప్రభుత్వం చర్యలతో కొంత దిగి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూడాలి మరి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.
Next Story