PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ అప్డేట్
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలలో పీఎం కిసాన్ యోజన స్కీమ్ ఒకటి. భూమి ఉన్న రైతులకు మోడీ సర్కార్ ప్రతి యేటా 6 వేల రూపాయలు అందిస్తోంది.
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలలో పీఎం కిసాన్ యోజన స్కీమ్ ఒకటి. భూమి ఉన్న రైతులకు మోడీ సర్కార్ ప్రతి యేటా 6 వేల రూపాయలు అందిస్తోంది. ఈ డబ్బులు ఒకే సారి కాకుండా మూడు విడతల్లో 2000 వేల రూపాయల చొప్పున అందిస్తోంది. ఇప్పటి వరకు 14వ విడత డబ్బులు అందుకోగా, ఇప్పుడు 15వ విడత కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. పంట పెట్టుబడికి, ఎరువులు కొనగోలుకు, వ్యవసాయానికి సంబంధించి ఆర్థిక సాయం చేయడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం.. లబ్ధిదారులు వారి బ్యాంక్ ఖాతా వివరాలకు ఆధార్ నంబర్‌తో అనుసంధానం చేయాలని సూచించింది.
ఈ 15వ విడత డబ్బులు నవంబర్ 15వ తేదీన రైతుల ఖాతాల్లో జమ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ విడత డబ్బులు అందితే దేశంలోని అర్హులైన 8 కోట్ల మంది రైతుల బ్యాంకు అకౌంట్ లోకి రూ. 2000 డిపాజిట్ కానున్నాయి.
ఈ రైతులకు డబ్బులు అందవు..
పీఎం కిసాన్ ప్రయోజనం పొందుతున్న రైతులు కేవైపీ పూర్తి చేసుకోవడం తప్పనిసరి. మీ సేవా కేంద్రాలు, ఇతర ఆన్లైన్ కేంద్రాలలో ప్రతి రైతు తమ ఆధార్‌తో పాటు ఇతర వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈకేవైసీ చేసుకొని రైతులకు ఈ విడత డబ్బులు అందవు. అలాగే ఈ పథకంలో డబ్బులు పందుతున్న రైతులు ఖాతా నంబర్ తప్పుగా ఇచ్చినా.. లేదా ఇతర వివరాలు తప్పుగా అనిపించినా కేంద్ర ప్రభుత్వం వారి డబ్బులను నిలిపివేసే అవకాశం ఉందని గుర్తించుకోండి.