Wed Nov 13 2024 00:43:38 GMT+0000 (Coordinated Universal Time)
మిత్రమా.. సెప్టెంబర్ 30 దగ్గర పడుతోంది
PPF అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, అలాగే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (NCSS)..
PPF అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, అలాగే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (NCSS) వంటి చిన్న పొదుపు పథకాలు ఉన్నవారి కోసం ఈ వార్తను గమనించాల్సిన అవసరం ఉంది. మీరు ఏవైనా సేవింగ్స్ స్కీమ్‌లను కలిగి ఉంటే ఈ పని చేసుకోవడం చాలా ముఖ్యం. వీలైనంత త్వరగా మీ ఆధార్, పాన్ నంబర్‌ను వాటికి లింక్ చేయండి. ఈ లింకు చేసుకునేందుకు చివరి గడువు సెప్టెంబర్ 30వ తేదీ. దీంతో సమయం దగ్గర పడుతోంది. వినియోగదారులు నిర్లక్ష్యం చేయకుండా ముందస్తుగానే ఈ పని పూర్తి చేసుకోవడం చాలా ముఖ్యం లేకుంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
అయితే చిన్న పొదుపు పథకాలు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయన్న విషయం అందరికి తెలిసిందే. ఇంతకు ముందు పథకాలను పొందేందుకు ఆధార్ కార్డు తప్పనిసరి అయ్యేది కాదు. చాలా మంది ఆధార్ ను సమర్పించకుండానే పథకాన్ని ప్రారంభించారు. ఆధార్, పాన్‌ను సమర్పించడం ఇప్పుడు తప్పనిసరి. మార్చి 31, 2023న కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. పీపీఎఫ్, ఎన్ఎస్సీ, ఇతర చిన్న పొదుపు పథకాల కోసం ఆధార్ కార్డు, పాన్ కార్డు లను తప్పనిసరిగ్గా సమర్పించాలని సూచించింది. అయితే ఈ కొత్త స్కీమ్ కోరుకునే వారు మాత్రమే కాకుండా, ఇప్పటికే ఆ పథకాలు చేసిన వారు కూడా ఆధార్ కార్డు, పాన్ కార్డు తప్పకుండా సమర్పించాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 30వ తేదీలోగా మీరు పథకం అందుకున్న పోస్టాఫీసు లేదా బ్యాంకు శాఖ కార్యాలయానికి వెళ్లి ఆధార్ నంబర్‌ను అందించాలి.
ఆధార్ సమర్పించకపోతే ఏమవుతుంది?
చిన్న మొత్తాల పొదుపు పథకాలకు ఆధార్, పాన్ నంబర్ ఇవ్వకపోతే పెట్టుబడి ఆగిపోతుంది. అంటే ఈ పథకాలలో పెట్టుబడి పెట్టిన మీ డబ్బు స్తంభింపజేయబడుతుంది. మీరు దానిని ఉపసంహరించుకోలేరు. వడ్డీ డబ్బులు కూడా జమ కావు. మీరు పథకాలలో డబ్బును డిపాజిట్ చేయడానికి కూడా పరిమితం చేయబడ్డారు.
Next Story