Paytm: వినియోదారులకు ఊరట.. పేటీఎంపై ఆర్బీఐ కీలక ప్రకటన
జనవరి చివరలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) Paytm పేమెంట్స్ బ్యాంక్‌ను కొత్త కస్టమర్లను జోడించకుండా, Fastag ..
జనవరి చివరలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) Paytm పేమెంట్స్ బ్యాంక్‌ను కొత్త కస్టమర్లను జోడించకుండా, Fastag నుండి వాలెట్‌కి కొత్త డిపాజిట్లను జోడించకుండా నిలిపివేసింది. ఈ నిషేధానికి ముందు ప్రజలకు ఫిబ్రవరి 29 వరకు మినహాయింపు ఇచ్చింది. తరువాత దానిని మార్చి 15 వరకు పొడిగించింది ఆర్బీఐ. ఇప్పుడు ఈ విషయంలో పేటీఎం వాలెట్ కస్టమర్లకు ఆర్బీఐ పెద్ద ఊరటనిచ్చింది. మార్చి 15 తర్వాత కూడా వాలెట్ సేవను వినియోగించుకుంటున్న 80 నుంచి 85 శాతం మంది వినియోగదారులు సౌకర్యవంతంగా ఉపయోగించుకోగలుగుతారని తెలిపింది.
80-85 శాతం Paytm వాలెట్ వినియోగదారులు తమ ఖాతాలు Paytm పేమెంట్స్ బ్యాంక్‌కు బదులుగా ఇతర బ్యాంకులతో లింక్ చేయబడి ఉన్నందున, దాని నిషేధం కారణంగా ఎటువంటి సమస్య ఎదురుకాదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం తెలిపారు. మిగిలిన వినియోగదారులు తమ Paytm పేమెంట్స్ బ్యాంక్ సేవలను వేరే బ్యాంకు ఖాతాకు లింక్ చేయాలని ఆయన సూచించారు.
మార్చి 15 వరకు సమయం సరిపోతుంది
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌తో లింక్ చేయబడిన వాలెట్‌ను ఇతర బ్యాంకులతో లింక్ చేయడానికి గడువు మార్చి 15 గా నిర్ణయించినట్లు గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశాలను ఆయన తోసిపుచ్చారు. మార్చి 15 వరకు ఇచ్చిన సమయం సరిపోతుందని, దానిని మరింత పొడిగించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.పేటీఎం వ్యాలెట్లలో 80-85 శాతం ఇతర బ్యాంకులతో అనుసంధానించబడి ఉన్నాయని, మిగిలిన 15 శాతం తమ వాలెట్లను ఇతర బ్యాంకులకు అనుసంధానం చేసుకోవాలని సూచించారు.