కస్టమర్లకు ఆర్బీఐ పెద్ద ఊరట.. బ్యాంకులకు ఝలక్..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్పుడప్పుడు బ్యాంకులకు కొరడా ఝులిపిస్తుంటుంది. ఎందుకంటే కొన్ని సందర్భాలలో..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్పుడప్పుడు బ్యాంకులకు కొరడా ఝులిపిస్తుంటుంది. ఎందుకంటే కొన్ని సందర్భాలలో బ్యాంకులకు ఖాతాదారులపై అధిక ఛార్జీలు వసూలు చేయడం, ఏదైనా సమస్యలుంటే వారిటి పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేయడం, అలాగే ఖాతాదారునికి లోన్ డబ్బుపులు పూర్తిగా చెల్లించినా అందుకు సంబంధించిన పత్రాలు ఇవ్వడంలో జాప్యం చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో తాజాగా రిజర్వ్ బ్యాంక్ అన్ని బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇంటి రుణం తీసుకునే వినియోగారులకు పెద్ద ఊరట కల్పించే వార్త అందించింది. వినియోగదారులు గృహ రుణం తీసుకునే సమయంలో అందుకు సంబంధించిన ఇంటి పత్రాలు బ్యాంకుల వద్దే ఉంటాయి. ఒరిజినల్ పత్రాలు తీసుకుని లోన్ మంజూరు చేస్తుంటాయి. అయితే లోన్ ఈఎంఐలు పూర్తిగా చెల్లించిన తర్వాత ఆ పత్రాలను తిరిగి వినియోగదారునికి ఇవ్వాల్సి ఉంటుంది.
కానీ కస్టమర్ బ్యాంకుల చుట్టూ తిరిగితే కానీ ఈ పత్రాలు ఇవ్వని పరిస్థితి ఉంటుంది. కాళ్లరిగే వరకు బ్యాంకుల చుట్టు తిరగాల్సిందే. ఈ రోజు, రేపు అంటూ నెలల తరబడి బ్యాంకుల వద్దే ఉండటంతో వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆర్బీఐ బ్యాంకులకు ఝలకిచ్చింది. ఇప్పుడు హోమ్ లోన్ని తిరిగి చెల్లించిన తర్వాత మీరు మీ రిజిస్ట్రీ పేపర్‌ను 30 రోజులలోపు తిరిగి పొందుతారు. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. 30 రోజుల లోపు బ్యాంకు రిజిస్ట్రీ పేపర్లను ఖాతాదారులకు తిరిగి ఇవ్వకపోతే, బ్యాంకు ప్రతిరోజు 5000 రూపాయల చొప్పున ఖాతాదారునికి జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఇందులో నిర్లక్ష్యం చేస్తే కఠినమైన చర్యలు ఉంటాయని కూడా హెచ్చరించింది.