హెచ్చరిక.. అలా ట్రేడింగ్ చేయకూడదు
అనధికారికంగా ఫారెక్స్ ట్రేడింగ్ నిర్వహిస్తున్న ప్లాట్‌ఫామ్‌లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
అనధికారికంగా ఫారెక్స్ ట్రేడింగ్ నిర్వహిస్తున్న ప్లాట్‌ఫామ్‌లకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్చరికలు జారీ చేసింది. ఎలాంటి గుర్తింపు లేకుండా ఫారెక్స్ ట్రేడింగ్ చేస్తున్న సంస్థల జాబితాలో మరో 19 సంస్థల పేర్లను ఆర్బీఐ చేర్చింది. ఆయా సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెబుతూ.. ఎలాంటి అనుమతులు లేకుండా ఫారెక్స్ ట్రేడింగ్ నిర్వహిస్తున్న సంస్థల పేర్లతో అలర్ట్ లిస్ట్ విడుదల చేసింది. అనధికారిక ప్లాట్‌ఫారమ్‌లలో ఫారెక్స్ లావాదేవీలను నిర్వహించడం చట్టపరమైన ఇబ్బందుల్లో పడేస్తుందని రిజర్వ్ బ్యాంక్ హెచ్చరించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన తాజా జాబితాలో.. ఎఫ్ఎక్స్ స్మార్ట్‌బుల్, జస్ట్ మార్కెట్స్, గోడో ఎఫ్ఎక్స్, అడ్మిరల్ మార్కెట్, బ్లాక్బుల్, ఈజీ మార్కెట్స్, ఎన్క్లేవ్ ఎఫ్ఎక్స్, ఫినోవిజ్ ఫిన్‌టెక్, ఎఫ్ఎక్స్ స్మార్ట్‌బుల్, ఎఫ్ఎక్స్ ట్రే మార్కెట్, ఫారెక్స్4యూ, గ్రోయింగ్ కేపిటల్ సర్వీస్, హెచ్ఎఫ్ మార్కెట్స్ లాంటి సంస్థలున్నాయి.