Mon Dec 23 2024 08:44:53 GMT+0000 (Coordinated Universal Time)
నేటితో ముగియనున్న గడువు
రూ.2000 నోట్ల ఉపసంహరణకు గడువు నేటితో అంటే అక్టోబర్ 7వ తేదీతో ముగియనుంది. దీంతో గడువు తర్వాత ఈ నోట్లు ఎవరి వద్దనైనా ఉంటే
రూ.2000 నోట్ల ఉపసంహరణకు గడువు నేటితో అంటే అక్టోబర్ 7వ తేదీతో ముగియనుంది. దీంతో గడువు తర్వాత ఈ నోట్లు ఎవరి వద్దనైనా ఉంటే వృధాగా మారనున్నాయి. ఈ 2 వేల రూపాయల నోట్లు ఉపసంహరణకు సెప్టెంబర్ 30తో ముగియగా, ఆర్బీఐ దానిని అక్టోబర్ 7 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా, మే 19, 2023న 2000 రూపాయల నోట్లను చెలామణి నుంచి తొలగించేందుకు రిజర్వ్ బ్యాంక్ వినియోగదారులకు నాలుగు నెలల సమయం ఇచ్చింది. సెప్టెంబర్ 30 వరకు ఉన్న గడువును అక్టోబర్ 7 వరకు పొడిగించడం ఈ పెద్ద నోట్లు ఉన్నవారికి కొంత ఊరట కలించినట్లయ్యింది. కానీ ఆ గడువు ఇప్పుడు నేటితో ముగియనుంది. రోజుకు రూ.20 వేల చొప్పున ఈ రెండు వేల రూపాయల నోట్లను మార్చుకునేందుకు అవకాశం కల్పించింది ఆర్బీఐ.
ఆర్బీఐ పాలసీ సమావేశం అనంతరం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ మాట్లాడారు. 2000 నోటుకు సంబంధించి ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కీలక సమాచారం ఇచ్చారు. మే నుంచి తిరిగి వచ్చిన రూ.3.43 లక్షల కోట్ల రూ.2000 నోట్లలో 87 శాతం బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో వచ్చినవేనని అన్నారు. ఇప్పుడు కూడా రూ.12 వేల కోట్ల విలువైన రూ.2000 నోట్లు మార్కెట్లో స్తంభించిపోయాయని, ఇంటి బ్యాంకులకు తిరిగి రావాల్సి ఉందన్నారు.అయితే ఈ రోజుతో ముగియనున్న గడువు ఆర్బీఐ మళ్లీ పొడిగించనుందా..? అంటే అలాంటిదేమి ఉండదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే నాలుగు నెలలకుపైగా సమయం ఇచ్చారని, గడువు ముగిసిన తర్వాత కూడా మళ్లీ ఆర్బీఐ పొడిగించిందని, ఇప్పుడు పొడిగింపు ఉండదని చెబుతున్నారు. అయితే ఇంకా రూ.12వేల కోట్ల విలువైన రెండు వేల రూపాయల నోట్లు ఇంకా మార్కెట్లో ఉన్నాయి. మరి ఒక రోజులోనే ఇన్ని నోట్లు బ్యాంకులకు తిరిగి వస్తాయా..? అన్నది మరో సందేహం. మరి చివరి నిమిషంలో ఆర్బీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
Next Story