Rules Change: ఫిబ్రవరి 1 నుంచి మారనున్న నిబంధనలు
ప్రతినెల వివిధ అంశాలలో మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. నెల రాగానే ఏయే అంశాలలో మార్పులు ఉంటాయో వినియోగదారులు గమనించడం
ప్రతినెల వివిధ అంశాలలో మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. నెల రాగానే ఏయే అంశాలలో మార్పులు ఉంటాయో వినియోగదారులు గమనించడం చాలా ముఖ్యం. ఎందుకంటే గమనించకుంటే ఆర్థికపరమైన నష్టాలు జరగవచ్చు. అలాగే ఈనెల జనవరి ముగియబోతోంది. ఫిబ్రవరి రాబోతోంది. అందుకే ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పలు నిబంధనలు మారనున్నాయి. అందుకే జనవరి 31 తర్వాత జరిగే మార్పులు గురించి తెలుసుకుందాం.
NPS పాక్షిక ఉపసంహరణ నియమాలు: PFRDA పాక్షిక ఉపసంహరణను సులభతరం చేయడానికి, చట్టానికి అనుగుణంగా ఉండేలా జనవరి 12, 2024న మాస్టర్ సర్క్యులర్‌ను జారీ చేసింది. ఇది ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానుంది. NPS ఖాతాదారులు తమ వ్యక్తిగత పెన్షన్ ఖాతా సహకారంలో (యజమాని సహకారం మినహా) 25 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఉపసంహరణ అభ్యర్థనను స్వీకరించిన తర్వాత ప్రభుత్వ నోడల్ కార్యాలయం రిసీవర్‌ను నామినేట్ చేస్తుంది. CRA ధృవీకరణ తర్వాత మాత్రమే పాక్షిక ఉపసంహరణ అభ్యర్థనలను ప్రాసెస్ చేస్తుంది.
IMPS నియమాలు మారుతాయి: ఇప్పుడు ఫిబ్రవరి 1 నుండి మీరు నేరుగా రూ.5 లక్షల వరకు నిధులను బదిలీ చేయవచ్చు. గతేడాది అక్టోబర్ 31న ఎన్పీసీఐ ఓ సర్క్యులర్ జారీ చేసింది. ఇప్పుడు మీరు రిసీవర్ ఫోన్ నంబర్, బ్యాంక్ ఖాతా పేరు నమోదు చేయడం ద్వారా డబ్బు పంపవచ్చు.
SBI హోమ్ లోన్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రత్యేక గృహ రుణ ప్రచారాన్ని నిర్వహిస్తోంది. దీని కింద బ్యాంకు ఖాతాదారులు గృహ రుణాలపై 65 bps వరకు తగ్గింపును పొందవచ్చు. ప్రాసెసింగ్ ఫీజు, హోమ్ లోన్ మాఫీకి చివరి తేదీ జనవరి 31, 2024. ఈ తగ్గింపు అన్ని గృహ రుణాలకు చెల్లుబాటు అవుతుంది.
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ 'ధన్ లక్ష్మి 444 డేస్' పేరుతో తీసుకొచ్చిన ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ పథకానికి జనవరి 31, 2024ని చివరి తేదీగా నిర్ణయించారు. అంతకు ముందు నవంబర్ 30, 2023 వరకే చివరి తేదీ ఉండగా.. దానిని జనవరి 31, 2024 వరకు పొడిగించింది. ఈ పథకంలో భాగంగా పెట్టుబడి పెట్టేవారికి 7.4%, సూపర్ సీనియర్లకు ఇది 8.05% చొప్పు వడ్డీ రేటు అందిస్తోంది.
ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీ: నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) KYC పూర్తి చేయని ఫాస్ట్‌ట్యాగ్‌లను నిషేధిస్తామని లేదా బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని తెలిపింది. ఫాస్టెగ్ కేవైసీ అప్డేట్ చేయడానికి చివరి తేదీ జనవరి 31.