Scam Alert: వామ్మో..ఇలా కూడా మోసం చేస్తున్నారా? జాగ్రత్త.. కొత్తరకం స్కామ్
Scam Alert: ఈ మధ్య కాలంలో ఆన్లైన్ మోసాలు విపరీతంగా పెరిగిపోయాయి. మోసాలను అరికట్టేందుకు పోలీసు యంత్రాంగం..
Scam Alert: ఈ మధ్య కాలంలో ఆన్లైన్ మోసాలు విపరీతంగా పెరిగిపోయాయి. మోసాలను అరికట్టేందుకు పోలీసు యంత్రాంగం ఎన్నో చర్యలు చేపట్టినా..ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అయితే మోసాలను అరికట్టాలంటే ముందుగా మనం అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. ఏ మాత్రం అనుమానం రాకుండా సులభంగా క్షణాల్లోనే మోసం చేసేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. టెక్నాలజీ పెరుగుతున్నకొద్ది కొత్త రకం మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో సాంకేతిక పెరిగిపోవడంతో ఏ పని చేసినా ఆన్లైన్లోనే చేసేస్తున్నాము. బ్యాంకు ఖాతా నుంచి వివిధ రకాల బ్యాంకు సేవలు కూడా ఆన్లైన్లోనే చేసేస్తున్నాము. ఇక ఇటీవల నుంచి ఆన్లైన్ షాపింగ్స్ కూడా విపరీతంగా పెరిగిపోయాయి.
షాప్‌ల కంటే ఆన్లైన్లోనే తక్కువ ధరల్లో ప్రోడక్ట్‌లు లభ్యమవుతున్నాయి. అంతేకాకుండా వినియోగదారులను ఆకర్షించేందుకు ఈ-కామర్స్ దిగ్గజాలు కొత్త కొత్త ఆఫర్లను ప్రవేశపెడుతూ వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. అయితే జనాలు కూడా ఎక్కువగా ఆన్లైన్ షాపింగ్‌కు అలవాటు పడుతుండటంతో వారిని ఆసరాగా చేసుకుని కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. ఎక్కువగా షాపింగ్ చేసేవారిపైనే దృష్టి సారిస్తున్నారు.
కొత్త రకం మోసం ఏంటి?
ఎక్కువ ఆన్లైన్ షాపింగ్ చేసేవారిని దృష్టిలో ఉంచుకుని మోసగాళ్లు ఈ మోసాలకు పాల్పడుతున్నారు. మరి వినియోగదారులను ఎలా మోసం చేస్తారో చూద్దాం. ముందుగా మీ మొబైల్‌కు ఔట్ ఫర్ డెలివరీ (Out for Delivery) అని చెప్పి మీకొకరు కాల్ చేస్తారు. దాని తర్వాత మీ ప్యాకేజిని డెలివరీ బాయ్ నుంచి పికప్ చేసుకునేందుకు ఓ ఫోన్ నంబర్‌ను ఇస్తారు. డెలివరీ బాయ్ నెంబర్ కోసం ముందుగా *401*నంబర్‌ను ఎంటర్ చేసి వేరే ఫోన్‌నంబర్‌ను ఎంటర్ చేయమని చెబుతారు. ఇంకేముంది మీ ఈ నంబర్లను ఎంటర్ చేయగానే మీకు వచ్చే కాల్స్, ఓటిపీలన్ని కూడా ఆ నంబర్‌కు వెళ్లిపోతాయి. తర్వాత మీ అకౌంట్లో ఉన్న డబ్బంతా ఖాళీ అయిపోతుంది. ఇలాంటి మోసాలు చాలానే జరుగుతున్నాయి.
ఇలాంటి విషయాలలో చాలా అప్రమత్తంగా ఉండాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా మీరు నిలువునా మోసపోయే ప్రమాదం ఉందని,తర్వాత ఎంత బాధపడ్డ లాభం ఉండదని సూచిస్తున్నారు. మీకు ఎవరైనా కాల్ చేసి నంబర్ ఇచ్చి వారికి కాల్ చేయాలని సూచిస్తే వెంటనే తిరస్కరించాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. ఎప్పుడు కూడా పార్సిల్ కోసం వారేఫోన్ చేసి మీ అడ్రస్‌కు వస్తారు తప్ప ఇలాంటి కాల్స్ చేయడం, వేరే నంబర్లను డయల్ చేయడం లాంటివి చేయరని గుర్తించుకోండి. సో.. ఇలాంటి కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని మీరు రక్షించుకోండి.