కస్టమర్లకు అలర్ట్.. సెప్టెంబర్‌లో 16 రోజుల పాటు బ్యాంకులు బంద్
ఇక ఆగస్టు నెల ముగిసి సెప్టెంబర్ నెల రానుంది. దీంతో రకరకాల మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. ఈ మార్పులు అనేది ముఖ్యంగా..
ఇక ఆగస్టు నెల ముగిసి సెప్టెంబర్ నెల రానుంది. దీంతో రకరకాల మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. ఈ మార్పులు అనేది ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలొ ఎక్కువగా ఉంటుంది. ఇక ప్రతి నెల బ్యాంకులకు సెలవులు వస్తుంటాయి. వాటిని దృష్టిలో ఉంచుకుని వినియోగదారులు బ్యాంకింగ్ పనుల కోసం ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి నెల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుల సెలవుల జాబితాను విడుదల చేస్తుంటుంది. వీటిని గమనించి బ్యాంకు పనులు చేసుకోవడం ఉత్తమం. లేకుంటే ఆర్థిక నష్టంతో పాటు సమయం వృధా అయ్యే అవకాశం ఉంది. మరి సెప్టెంబర్ నెలలో బ్యాంకులు ఏయే రోజుల్లో మూసి ఉండనున్నాయో తెలుసుకుందాం. మొత్తం 16 రోజుల పాటు సెలవులు రానున్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఈ బ్యాంకు సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించవు. ఆయా రాష్ట్రాల పండగలు, ఇతర కార్యక్రమాలను బట్టి ఉంటాయని గమనించండి.
➦సెప్టెంబర్ 3, 2023: ఆదివారం కారణంగా బ్యాంకులు మూసివేయబడతాయి.
➦ సెప్టెంబర్ 6 - శ్రీ కృష్ణ జన్మాష్టమికి భువనేశ్వర్, చెన్నై, హైదరాబాద్, పాట్నాలోని బ్యాంకులు మూసివేయబడతాయి.
➦ సెప్టెంబర్ 7 - శ్రీ కృష్ణ జన్మాష్టమి కారణంగా అహ్మదాబాద్, చండీగఢ్, డెహ్రాడూన్, గాంగ్టక్, తెలంగాణ, జైపూర్, జమ్ము, కాన్పూర్, లక్నో, రాయ్‌పూర్, రాంచీ, షిల్లాంగ్, సిమ్లా, శ్రీనగర్ వంటి నగరాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి.
➦ సెప్టెంబర్ 9 - రెండవ శనివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
➦ సెప్టెంబర్ 10 - ఆదివారం అన్ని బ్యాంకులకు సెలవు.
➦ సెప్టెంబర్ 17 - ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
➦ సెప్టెంబర్ 18 - వినాయక చతుర్థికి బెంగళూరు, తెలంగాణలో బ్యాంకులు బంద్.
➦ సెప్టెంబర్ 19- గణేష్ చతుర్థి ఫలితంగా అహ్మదాబాద్, బేలాపూర్, భువనేశ్వర్, ముంబై, నాగ్‌పూర్, పనాజీలలో బ్యాంకులకు సెలవు.
➦ సెప్టెంబర్ 20 - గణేష్ చతుర్థి, నుఖాయ్ కారణంగా కొచ్చి, భువనేశ్వర్ బ్యాంకులకు సెలవు.
➦ సెప్టెంబర్ 22 - శ్రీ నారాయణ గురు సమాధి దినం కొచ్చి, పనాజీ, త్రివేండ్రంలో బ్యాంకులు బంద్ ఉంటాయి.
➦ సెప్టెంబర్ 23 - నాల్గవ శనివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
➦ సెప్టెంబర్ 24 - ఆదివారం మరో బ్యాంక్ సెలవుదినం.
➦ సెప్టెంబర్ 25 - శ్రీమంత్ శంకర్‌దేవ్ జన్మదినోత్సవం సందర్భంగా గౌహతి బ్యాంకులకు సెలవు.
➦ సెప్టెంబర్ 27 - మిలాద్-ఎ-షరీఫ్ జమ్మూ, కొచ్చి, శ్రీనగర్, త్రివేండ్రంలోని బ్యాంకులు బంద్
➦ సెప్టెంబర్ 28 - ఈద్-ఇ-మిలాద్ ఫలితంగా అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, కాన్పూర్, లక్నో, ముంబై, న్యూ ఢిల్లీతో సహా వివిధ నగరాల్లో బ్యాంకులకు సెలవు.
➦ సెప్టెంబర్ 29 - ఈద్-ఎ-మిలాద్-ఉన్-నబీ కోసం గాంగ్టక్, జమ్మూ, శ్రీనగర్‌లోని బ్యాంకులు బంద్