వినియోగదారులకు షాకివ్వనున్న స్మార్ట్ టీవీలు.. భారీగా పెరగనున్న ధరలు
స్మార్ట్ టీవీల ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ప్యానెల్ ధరలు పెరగడంతో ఈ సంవత్సరం తొలి..
స్మార్ట్ టీవీల ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ప్యానెల్ ధరలు పెరగడంతో ఈ సంవత్సరం తొలి ఆరు నెలల్లో స్మార్ట్ టీవీల ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయని కౌంటర్‌పాయింట్స్ ఐవోటీ సర్వీస్ తెలిపింది. అయితే దేశీయంగా ప్రీమియం మాడళ్లకు డిమాండ్ అధికంగా ఉండటంతో స్మార్ట్ టీవీ దిగుమతులు 9 శాతం మేర పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. వినియోగదారులు అభిరుచులు మారుతున్నాయని, ముఖ్యంగా అతిపెద్ద స్క్రీన్ టీవీలకు అప్‌గ్రేడ్ అవుతుండటం ఇందుకు కారణమని తెలిపింది. ఈ రోజుల్లో ఆన్లైన్, ఆఫ్లైన్లలో స్మార్ట్ టీవీలు భారీగానే కొనుగోలు చేస్తున్నారు.
ప్రస్తుతం ఆఫ్‌లైన్ కంటే ఆన్లైన్లోనే ఎక్కువ కొనుగోళ్లు చేస్తున్నారు. ప్రీమియం టీవీలకు పెరుగుతున్న డిమాండ్‌తో సరాసరి వీటి విక్రయ ధర కూడా అధికం కాబోతోంది. దేశ ఆర్థిక పరిస్థితులు నిరాశాజనకంగా ఉండటంతో గతేడాది టీవీల దిగుమతులు 16 శాతం మేర తగ్గిన విషయం తెలిసిందే. దేశీయంగా వినియోగిస్తున్న టీవీల్లో స్మార్ట్ టీవీల వాటా 93 శాతంగా ఉంది. ఈ ఏడాది మరింత పెరిగే అవకాశం కూడా ఉందని తన నివేదికలో వెల్లడించింది.