మీ ఆధార్‌కు ఏ మొబైల్ నంబర్ లింక్ చేశారో తెలియడం లేదా..? ఇలా తెలుసుకోండి
ప్రస్తుతం ఆధార్ అనేది జీవితంలో ఒక భాగమైపోయింది. ఇది లేనిది ఏ పని జరగదు. సిమ్‌కార్డు నుంచి ప్రభుత్వ, ప్రైవేటు పథకాలు..
Aadhaar - ప్రస్తుతం ఆధార్ అనేది జీవితంలో ఒక భాగమైపోయింది. ఇది లేనిది ఏ పని జరగదు. సిమ్‌కార్డు నుంచి ప్రభుత్వ, ప్రైవేటు పథకాలు, బ్యాంకు అకౌంట్ వరకు అలా అన్ని రకాల వాటికి ఆధార్ కావాల్సిందే. అయితే ఆధార్‌కు మొబైల్ నంబర్‌ను లింక్ చేయడం తప్పనిసరి. ఒకవేళ ఆధార్‌కు మొబైల్ నంబర్ లింకు చేయకపోతే ఇబ్బంది పడాల్సిందే. ప్రస్తుతం ఆధార్‌ను ఉపయోగిస్తుంటే మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఒక వేళ మీరు లింక్ చేయకుంటే మీ మొబైల్ నంబర్‌కు ఓటీపీ రాదు. అలాంటి సమయంలో మీ పనులు నిలిచిపోయే అవకాశం ఉంది.ఈ ఓటీపీని ఎంటర్ చేయడం ద్వారానే ఆధార్ సంబంధిత సేవలను పొందొచ్చు. అయితే మనలో కొందరికీ ఆధార్ కార్డ్ ఏ ఫోన్ నెంబర్‌తో లింక్ అయిందో మర్చిపోతారు. అలాంటప్పుడు మన ఆధార్ కార్డ్‌కు ఏ ఫోన్ నెంబర్ లింక్ అయ్యిందో తెలుసుకోవడానికి యూఐడీఏఐ ఒక కొత్త సదుపాయాన్ని ప్రారంభించింది.
ఆధార్‌కు ఏ మొబైల్ నంబర్ లింకు చేశారో తెలుసుకోండిలా..
☛ ముందుగా ఏదైనా బ్రౌజర్‌ను ఓపెన్ చేసి అధికారిక వెబ్సైట్ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI)ను సందర్శించండి.
☛ My Aadhaar సెక్షన్లో Aadhaar Services లో Verify Email / Mobile Number ఆప్షన్ సెలెక్ట్ చేయండి.
☛ ఒక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.
☛ తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన Send OTP పైన క్లిక్ చేయాలి.
☛ మీరు సరైన మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే The Mobile Number xxxxxxxxxx matches with our records అని వస్తుంది.
☛ ఆధార్ కు లింక్ లేని నంబర్‌ను ఎంటర్ చేస్తే The Mobile number you had entered does not match with our records అని వస్తుంది.
☛ ఇలా వచ్చినట్లయితే మరో నెంబర్‌తో ట్రై చేయాలి.
☛ మీరు ఇలాగే ఇమెయిల్ ఐడీని కూడా వెరిఫై చేయవచ్చు.
అయితే అసలు మొబైల్ నెంబర్ ఏదో ఏమాత్రం ఐడియా కూడా లేకపోతే ఎలా తెలుసుకోవాలన్న అనుమానం కూడా వస్తుంది. ఇది కూడా సాధ్యం అవుతుంది. యూఐడీఏఐ వెబ్సైట్లో మీరు మీ ఆధార్ నెంబర్‌కు ఏ మొబైల్ నెంబర్ లింక్ చేశారో సులువుగా తెలుసుకోవచ్చు.
☛ ముందుగా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి.
☛ My Aadhaar సెక్షన్లో Aadhaar Services లో Verify an Aadhaar Number పైన క్లిక్ చేయండి.
☛ ఆ తర్వాత ఆధార్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి.
☛ Proceed to Verify పైన క్లిక్ చేయండి.
☛ Aadhaar Number xxxxxxxxxxxx Exists అని వస్తుంది.
☛ దాంతో పాటు మొబైల్ నెంబర్ దగ్గర ఫోన్ నెంబర్ చివరి 3 అంకెలు కనిపిస్తాయి. ఇలా అంకెలు కనిపిస్తే మీకు ఏ మొబైల్ నంబర్ లింక్ చేశారో విషయం తెలిసిపోతుంది.
☛ మొబైల్ నెంబర్ స్థానంలో ఖాళీగా ఉంటే ఆ ఆధార్ నంబర్‌కు ఏ ఫోన్ నంబర్ లింక్ కాలేదని అర్థం.