Mon Dec 23 2024 19:51:05 GMT+0000 (Coordinated Universal Time)
అతి తక్కువ ధరల్లో ఆటోమేటిక్ కార్లు ఇవే.. సామాన్యులకు బెస్ట్ ఆప్షన్
టెక్నాలజీ పెరిగిపోతోంది. రోజురోజుకు మార్కెట్లో కొత్త కొత్త కార్లు అందుబాటులోకి వస్తున్నాయి. అత్యాధునిక ఫీచర్స్‌ను ..
టెక్నాలజీ పెరిగిపోతోంది. రోజురోజుకు మార్కెట్లో కొత్త కొత్త కార్లు అందుబాటులోకి వస్తున్నాయి. అత్యాధునిక ఫీచర్స్‌ను జోడిస్తూ కస్టమర్లను మరింతగా ఆకట్టుకునే విధంగా ఆటో మొబైల్ కంపెనీలు ముందుకు సాగుతున్నాయి. ఆటోమేటిక్ కార్లు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే సాధారణంగా ఆటోమేటిక్ అనగానే వాటి ధర ఎక్కువగా ఉంటుందని అందరూ అనుకుంటారు. ఇటీవల అందుబాటులోకి వచ్చిన ఆటోమేటెడ్ మాన్యువల్ గేర్ బాక్స్(ఏఎంటీ) టెక్నాలజీతో అతి తక్కువ ధరలోనే మన దేశంలో అందుబాటులోకి వచ్చింది. ఈ కార్లలో ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్ ఉంది.
- రెనాల్డ్ క్విడ్: సిటి పరిధిలో వినియోగించుకునేదుకు అద్భుతమైన కారని చెప్పాలి.ఇది. దీనిలో కొత్త రెనాల్డ్ క్విడ్ ఏఎంటీ వన్ లీటర్ ఇంజిన్ తో వస్తుంది. ఇది 67 బీహెచ్ పీ, 91ఎన్ఎం గరిష్ట టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటర్ పై 24 కిలోమీటర్ల మైలేజీని వరకు అందిస్తుందని కంపెనీ చెబుతోంది.
- హ్యుందాయ్ శాంత్రో: ఈ కారు ఏఎంటీ టెక్నాలజీతో కూడిన కార్లలో బెస్ట్ ఆప్షన్ కావచ్చు. 1.1-లీటర్ ఇంజిన్ సహాయంతో పనిచేస్తుంది. 68 హార్స్పవర్, 99 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేసే కేపాసిటిని రూపొందించింది కంపెనీ. లీటర్ కు 20.3 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటి ధరలు రూ. 5.18 లక్షల నుంచి రూ. 5.46 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటాయని తెలుస్తోంది. దీనిలో యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన టచ్ స్క్రీన్ వంటి సిస్టమ్‌ను రూపొందించింది కంపెనీ.
- మారుతి సుజుకీ సెలెరియో: దేశంలో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ను అందిస్తున్న కంపెనీ మారుతి సుజుకీ. ఈ కంపెనీ ఇప్పటి వరకూ దాదాపు 4 లక్షల ఏఎంటీ వాహనాలను విక్రయించింది. ఈ ఆటోమేటిక్ గేర్ బాక్స్ కలిగిన మొట్టమొదటి కారు ఈ మారుతి సెలెరియో. దీనిలోని ఇంజిన్ 67 హార్స్ పవర్ తో పాటు 90 ఎన్ఎం గరిష్ట టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. లీటర్ పై 23.1 కిలోమీటర్ల మైలేజీ వస్తుంది. దీని ధర రూ. 4.97 లక్షల నుంచి రూ. 5.40 లక్షలు వరకు ఉంటుంది.
- టాటా టియాగో: భారత్‌లో అందుబాటులో ఉన్న బెస్ట్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ కలిగిన కారు ఇదని చెప్పాలి. 1.2-లీటర్ ఇంజన్ 84 హార్స్పవర్, 114 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. లీటర్ కు ఏకంగా 23.8 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. మాన్యువల్ గేర్ బాక్స్ తో పాటు ఏఎంటీ 5-స్పీడ్ ఆటోమేటిక్ వెర్షన్‌ను కూడా అందుబాటులో ఉంది. వీటి ధరలు రూ. 5.04 లక్షల నుంచి రూ. 5.63 లక్షల వరకు ఉంటాయి.
Next Story