Mon Nov 25 2024 21:48:56 GMT+0000 (Coordinated Universal Time)
Godl Price Today : బంగారం పరుగులు ఆపింది అంటే.. ముందుంది ముప్పు అనే అర్ధమేనా?
ఈరోజు దేశంలో బంగారం, వెండి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి.
బంగారం ధరలు మరింత పెరుగుతాయన్నది మార్కెట్ నిపుణుల అంచనా. ధరలు ఎంత ఎగబాకినా కొనుగోళ్లు మాత్రం ఆగడం లేదు. కొనుగోలు దారులతో జ్యుయలరీ దుకాణాలు కిటకిటలాడుతూనే ఉన్నాయి. దేశంలో అత్యంత లాభమైన వ్యాపారం ఏదైనా ఉందంటే అది గోల్డ్ బిజినెస్. ఎందుకంటే దీనికి డిమాండ్ ఎప్పుడూ తగ్గదు. కొనుగోలు చేసిన బంగారానికి విలువ పెరుగుతుందే కానీ తగ్గడం అంటూ జరగదు. అందుకే వీధికొక జ్యుయలరీ దుకాణాలు వెలుస్తున్నాయి. కార్పొరేట్ సంస్థలు కూడా గల్లీకొక బ్రాంచిని ఓపెన్ చేస్తుండటమూ కారణం ఇదే.
లాభాలు అలా...
బంగారం వ్యాపారం ఖర్చుతో కూడుకున్నదే అయినా.. రిస్క్ అయినదే అయినా.. అదే సమయంలో లాభాలు కూడా అంతే స్థాయిలో ఉంటాయంటారు. అందుకే చిన్న చిన్న దుకాణాలు మొదలు బడా సంస్ధలు కూడా బంగారం దుకాణాలను దక్షిణ భారత దేశంలో ప్రతి చిన్న పట్టణంలోనూ ప్రారంభిస్తూ తమ కొనుగోళ్లను పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. బంగారానికి ఎప్పుడూ వన్నె తగ్గనట్లుగానే ధరలు కూడా పడిపోవు. అలాగే కొనుగోళ్లు కూడా మందగించవు. అందుకే బంగారం మూడు గ్రాములు.. ఆరు తులాలుగా వర్థిల్లుతుంది.
నిలకడగానే...
ప్రధానంగా దక్షిణ భారత దేశంలో బంగారం కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతుంటాయి. ఇక పెళ్లిళ్ల సీజన్ లో అయితే చెప్పాల్సిన పనిలేదు. పరుగు మొదలు పెట్టిందంటే ఆగేది ఉండదు. ఈరోజు దేశంలో బంగారం, వెండి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరల 66,850 రూపాయలు పలుకుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 84,000 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 87,500 రూపాయల వద్ద ట్రెండ్ అవుతుంది.
Next Story