Tue Nov 26 2024 18:49:27 GMT+0000 (Coordinated Universal Time)
Gold Prices : గుడ్ న్యూస్... బంగారం ప్రియులు ఇక ఎగబడి కొనేయొచ్చు
ఈరోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. దీంతో కొనుగోలు దారులకు ఊరట లభించినట్లయింది
బంగారం ధరలు తగ్గాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. తమకు ధరలు అందుబాటులో ఉండేలా ధరలు ఉండాలని ఆకాంక్షిస్తారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధరలు తగ్గితే ఎంత బాగుండు అని కొనేముందు ప్రతి కొనుగోలుదారుడు ఆలోచిస్తాడు. ఒకరోజు తగ్గితే రెండు రోజులు ధరలు పెరడగం బంగారానికి ఉన్న ప్రత్యేకత. అందుకే తగ్గినప్పుడే కొనుగోలు చేయడం మంచిదని మార్కెట్ నిపుణులు సూచిస్తారు. కొనుగోళ్లు తగ్గడంతో ధరలు కూడా తగ్గుతాయని వేచి చూసే వారు చాలా మంది ఉంటారు.
తగ్గినప్పుడే...
మధ్య తరగతి ప్రజలు బంగారం కొనుగోలు చేయాలంటే గగనమై పోయింది. కానీ కుటుంబంలో జరిగే శుభకార్యాలకు కొనుగోలు చేయకుండా ఉండలేని పరిస్థితి. అందుకోసం అప్పు చేసైనా బంగారం కొనుగోలు చేయడం అలవాటుగా మార్చుకున్నారు. ధరలు పెరిగినప్పుడల్లా నిరాశపడటం, తగ్గినప్పుడల్లా సంతోషపడటం కొనుగోలుదారులకు మామూలయిపోయింది. బంగారం ధరలు తగ్గాయని సంతోషించే లోగా మళ్లీ పెరిగే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు.
వెండి స్థిరంగా...
ఈరోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. దీంతో కొనుగోలు దారులకు ఊరట లభించినట్లయింది. పది గ్రాముల బంగారం ధరపై ఆరు వందల రూపాయలు తగ్గింది. వెండి ధరలు మాత్రం ఈరోజు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం దర 57,500 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం 62,730 రూపాయలుగా నమోదయింది. ఇక కిలో వెండి ధర మాత్రం 8.చ200 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.
Next Story