Fri Nov 22 2024 22:34:49 GMT+0000 (Coordinated Universal Time)
Gold Prices : భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఇక కొనలేమోమో
ఈరోజు బంగారం ధరలు దేశ వ్యాప్తంగా భారీ పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై ఆరు వందల రూపాయలు పెరిగింది
పసిడికి ఎప్పుడూ డిమాండ్. ఇక పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమయిన తర్వాత దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ధరలు మరింత పెరుగుతున్నాయి. ఇవి కొనుగోలుదారుల్లో ఆందోళన కలిగిస్తున్నా సంస్కృతీ సంప్రదాయాలను అనుసరించి కొనుగోలు చేయక తప్పింది కాదు. అందుకే బంగారం ధరలు ఎంత పెరుగుతున్నా దాని డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. సీజన్ తో సంబంధం లేకుండా కొనుగోలు చేసే వస్తువు కూడా పసిడి కావడంతో ఎప్పుడూ జ్యుయలరీ దుకాణాలు కళకళలాడుతుంటాయి.
సీజన్ కావడంతో...
ధరలు పెరగడానికి పెళ్లిళ్లు ఒక్కటే కారణం కాదు. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, డాలర్ తో రూపాయి విలువ కూడా ఒక కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బంగారం ధరలు తగ్గినప్పుడు స్వల్పంగా, పెరిగినప్పుడు భారీగా ధరలు నమోదు కావడం కొనుగోలుదారులకు కూడా అలవాటుగా మారింది. అందుకే బంగారం ధరలను గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. తమ అవసరాలకు మించి కాకుండా అవసరమైనంత వరకే కొనుగోలు చేయడం అలవాటు చేసుకుంటే మంచిదంటున్నారు.
వెండి కూడా...
ఈరోజు బంగారం ధరలు దేశ వ్యాప్తంగా భారీ పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై ఆరు వందల రూపాయలు పెరిగింది. వెండి ధర కూడా భారీగానే పెరిగింది. కిలో వెండి ధరపై పదిహేను వందల రూపాయలు పెరగింది. దీంతో హైదరాబాద్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 56,650 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 61,690 రూపాయలుగా ఉంది. ఇక కిలో వెండి ధర మాత్రం 79,500 రూపాయలకు చేుకుంది.
Next Story