Sun Nov 24 2024 05:31:10 GMT+0000 (Coordinated Universal Time)
Gold Price Today : చాలా రోజులకు మగువలకు గుడ్ న్యూస్.. బంగారం ధరలు ఈరోజు ఎంతంటే?
నేడు దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు కూడా నిలకడగా ఉన్నాయి.
బంగారం ధరలు మరింత ప్రియమవుతాయని అందరూ అంచనా వేస్తున్నారు. రానున్న కాలంలో ధరలు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. అందుకే ఇప్పుడే బంగారం కావాల్సిన వాళ్లు కొనుగోలు చేయడం మంచిదన్న సూచనలు వెలువడుతున్నాయి. బంగారం ధరలు ఇటీవల కాలంలో వరసగా పెరుగుతూనే ఉన్నాయి. దీంతో ధరలు సామాన్యులకు, మధ్యతరగతి ప్రజలకు అందకుండా పోయాయి. పది గ్రాముల బంగారం ధర ఎనభై వేల రూపాయలకు చేరుకుంది. అదే సమయంలో కిలో వెండి ధర కూడా లక్ష కు చేరి మళ్లీ దిగి రావడం ప్రారంభమయింది. అయితే ధరలు మరింత ప్రియమవుతాయని భావించి ఇప్పుడే కొనుగోలు చేయడం మంచిదని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.
ధరలు దిగి వచ్చినప్పుడే...
నిన్న ఒక్కరోజే పది గ్రాముల బంగారం ధరపై 900 రూపాయల వరకూ పెరిగింది. వెండి ధర మాత్రం గణనీయంగా తగ్గింది. అయితే ఈ ధరలు నిలకడగా ఉండే అవకాశం లేదన్నది వ్యాపారుల మాట. ధరలు దిగివచ్చినప్పుడే కొనుగోలు చేయాలని, తర్వాత కొనుగోలు చేయాలనుకున్నా ధరలు అందుబాటులో ఉండవని చెబుతున్నారు. ఇప్పటికే కొనుగోళ్లు తగ్గడం బంగారం దుకాణాల యజమానులు వినియోగదారులను ఆకట్టుకునేందుకు అనేక ఫీట్లు చేస్తున్నాయి. పలు రకాల ఆఫర్లతో తమ షాపునకు కస్టమర్లను రప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. తరుగు మీద డిస్కౌంట్ తో పాటు ఇంత బంగారం కొనుగోలు చేస్తే వెండి ఫ్రీ అంటూ భారీ ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నారు.
స్థిరంగా ధరలు...
బంగారం ధరలు ఒకరోజు పెరిగితే మరొక రోజు తగ్గుతాయి. అదే సమయంలో అనేక కారణాలతో ప్రతిరోజూ బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి మారకం విలువ, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, యుద్ధాలు, ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కావడం వంటి కారణాలతో బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు మారుతుంటాయి. అయితే నేడు దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు కూడా నిలకడగా ఉన్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 2 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 73,000 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం దర 79,640 రూపాయల వద్ద ట్రెండ్ అవుతుంది. కిలో వెండి ధర 92,000 వద్ద కొనసాగుతుంది.
Next Story