Tue Nov 05 2024 23:14:20 GMT+0000 (Coordinated Universal Time)
Gold Rates Today : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనుందా?
నేడు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా నిలకడగానే ఉన్నాయి
మాఘమాసం ఎంటర్ కావడంతో పసిడి ధరలు కూడా పెరుగుతాయన్న అంచనాలకు నేడు బ్రేక్ పడింది. పసిడి ధరలు ఎప్పుడూ పైపైకే చూస్తుంటాయి. నేల చూపులు అనేది చాలా తక్కువ. వెండి ధరలు కూడా పెరుగుతూనే ఉంటాయి. బంగారం, వెండికి ఎక్కువగా పెళ్లిళ్ల సీజన్ లో డిమాండ్ ఉంటుంది. అందుకే డిమాండ్ కు తగినట్లుగా ఈ వస్తువులు మార్కెట్ లో దొరకవు. భారత ప్రభుత్వం బంగారం దిగుమతులను తగ్గించడంతో ధరలు ఆటోమేటిక్ గా పెరుగుతాయని అంచనాలు వినిపిస్తాయి.
పెళ్లిళ్ల సీజన్ కూడా...
అయితే ఇదే సమయంలో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో మరో మూడు నెలలు బంగారం కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ సీజన్ లో బంగారం కొనుగోలు చేయాలంటే కష్టంగానే ఉంటుంది. కానీ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం బంగారం కొనుగోలు తప్పనిసరి కావడంతో రద్దీ ఏమాత్రం తగ్గదు. విదేశాల్లో కొనసాగుతున్న ఆర్థిక మాంద్యం, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు వంటివి కూడా బంగారం ధరల్లో హెచ్చు తగ్గులకు ఒక కారణంగా చూడాలి.
స్థిరంగానే...
నేడు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా నిలకడగానే ఉన్నాయి. ఇది బంగారొ కొనుగోలు చేసే వారికి శుభవార్త అని చెప్పాలి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరల 57,700 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 63,950 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధరలో కూడా ఎలాంటి మార్పు లేకపోవడంతో 76,500 రూపాయల వద్ద ట్రెండ్ అవుతుంది.
Next Story