Thu Dec 19 2024 05:04:09 GMT+0000 (Coordinated Universal Time)
Gold Price Today : మహిళలకు తీపికబురు.. బంగారం ధరలు దిగివచ్చాయ్
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొద్దిగా తగ్గుదల కనిపించింది
బంగారం ధరలు నిత్యం పెరుగుతూనే ఉంటాయి. దానికి డిమాండ్ అధికంగా ఉండటంతో ధరలు అదుపులో ఉండవు. వాటిని నియంత్రించడం కూడా ఎవరి తరమూ కాదు. అనేక కారణాలతో ప్రతి రోజూ బంగారం, వెండి ధరల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. అనేక కారణాలు ధరల పెరుగుదలకు కారణమవుతాయి. అలాగే కొన్ని కారణాలతో ధరలు తగ్గనూ వచ్చు. లేదంటే స్థిరంగా ఉండవచ్చు. ఉదయం ఉన్న బంగారం, వెండి ధరలు మధ్యాహ్నానికి మారిపోతాయి. అందుకే బంగారం ధరలు అందుబాటులోకి వచ్చినప్పుడే కొనుగోలు చేయాలని మార్కెట్ నిపుణులు పదే పదే చెబుతుంటారు. ఏమాత్రం ఆలస్యం చేసినా, అలక్ష్యం చేసినా వాటి ధరలు అందనంత పెరిగిపోతాయని హెచ్చరిస్తూనే ఉంటారు.
కొనుగోలు సమయం...
బంగారం ధరలు అంతర్జాతీయ ధరల ఒడిదుడుకులపై ఎక్కువగా ప్రభావం చూపుతుంటాయి. అలాగే విదేశాల్లో నెలకొన్న మాంద్యం, ద్రవ్యోల్బణం, డాలర్ తో రపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం, వెండి ధరల్లో తరచూ తగ్గుదల, పెరుగుదల కనిపిస్తుంటుంది. ఇంకా పెళ్లిళ్ల సీజన్, శుభకార్యాలు, మంచి ముహూర్తాలు ఉండటంతో డిమాండ్ అనేది తగ్గదు. కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతుంటాయి. ఎప్పుడైతే డిమాండ్ పెరుగుతుందో అదే సమయంలో దాని ధర కూడా ఆటోమేటిక్ గా పెరుగుతుంది. ఇది ఏ వస్తువుకైనా జరిగే పరిణామమే. అందుకే ధరలు తగ్గినప్పుడే కొనుగోలు చేయడం మంచిదని మార్కెట్ నిపుణులు పదే పదే చెబుతున్నా ఇంకా తగ్గుతాయేమోనని వెయిట్ చేస్తూ సొమ్ములు వేస్ట్ చేసుకునేవారు అధికంగా ఉన్నారు.
తగ్గినట్లు కనిపించినా...
బంగారం, వెండి వస్తువులు ఇప్పుడు కేవలం కొన్ని వర్గాలకే పరిమితమయ్యాయి. సామాన్య, మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేయలేని పరిస్థితి ఎప్పుడో వచ్చింది. అయినా సరే సంస్కృతి, సంప్రదాయాల కోసం బంగారం, వెండిని దక్షిణ భారత దేశంలో కొనుగోలు చేస్తున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొద్దిగా తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 71,340 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 77,830 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 99,900రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.
Next Story