Tue Nov 26 2024 00:26:12 GMT+0000 (Coordinated Universal Time)
Gold Rates Today : బంగారం ప్రియులకు కొంత ఊరట.. వెండి కొనేవారికి కూడా
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధర పై పది రూపాయలు తగ్గింది
బంగారం ధరలకు కళ్లెం వేయడానికి పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవు. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, దిగుమతుల తగ్గింపు, విదేశాల్లో నెలకొన్న మాంద్యం వంటి కారణాలతో బంగారం ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. వెండి ధరలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి. వీటిని అదుపు చేయడం ఇక సాధ్యం కాదని భావిస్తున్న తరుణంలో కొనుగోలుదారులకు నేడు స్వల్ప ఊరట దక్కింది. బంగారం ధరలకు బ్రేక్ పడింది.
పెళ్లిముహూర్తాలు...
మరో తొమ్మిది రోజులు పెళ్లి ముహూర్తాలు పూర్తవుతాయి. ఆ తర్వాత మూడు నెలల వరకూ ఇక ముహూర్తాలు లేవు. దీంతో బంగారం ధరలు దిగి వస్తాయని అందరూ ఆశిస్తున్నారు. గత రెండు నెలల్లోనే పది గ్రాముల బంగారంపై పదకొండు వేల రూపాయల వరకూ పెరిగింది. తగ్గినా అంత మేరకు తగ్గదు. స్వల్పంగానే తగ్గుందన్నది మార్కెట్ నిపుణుల అంచనాగా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో కొనుగోళ్లు ఇప్పుడు చేయడం మంచిదని, మదుపు చేసేవారికి సూచనలు చేస్తున్నారు నిపుణులు.
నేటి ధరలు...
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధర పై పది రూపాయలు తగ్గింది. వెండి ధరలు కూడా స్వల్పంగానే తగ్గాయి. కిలో వెండి ధరపై వంద రూపాయలు మాత్రమే తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 67,640 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 73,790 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 89,900 రూపాయలుగా ఉంది.
Next Story